Featured

మేడిన్ ఇండియా వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. ధర ఎంతంటే?

భారతీయ ఇయర్ ఫోన్స్ బ్రాండ్ మివీ మన దేశంలో సరికొత్త బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది.అవే మివీ కాలర్ క్లాసిక్. ఈ ఇయర్ ఫోన్స్ లో మూడు బటన్లను అందుబాటులో ఉంచారు. ఈ బటన్స్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేయడం,ఫోన్ కాల్స్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయడం వంటివి చేయవచ్చు.త్వరలోనే భారతదేశంలో తయారైన ఈ ఇయర్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభం కానున్నాయి.

మివీ తయారుచేసిన ఈ ఇయర్ ఫోన్స్ లో మూడు జతల బడ్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని మన సైజును బట్టి మార్చుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఇయర్ ఫోన్స్ ధర కేవలం ఫ్లిప్ కార్ట్ సేల్స్ ద్వారా రూ.999 గా నిర్ణయించారు.బ్లాక్, బ్లూ, గ్రీన్, గ్రే, ఆరెంజ్, రెడ్ రంగులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఇయర్ ఫోన్స్ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కంపెనీ తెలియజేయడం లేదు.

ఇందులో బ్లూటూత్ వీ5.0 టెక్నాలజీని అందించడంతో పాటు బరువు కూడా చాలా తక్కువగా ఉండే విధంగా రూపొందించారు. ఈ బ్లూటూత్ లో ఉండే మూడు బటన్ ల ద్వారా పాటను వినడం లేదా ఫార్వర్డ్ చేయడం, ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం వంటి సదుపాయాలను కల్పించింది.ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ ఉంది. దీని ద్వారా గూగుల్ అసిస్టెంట్, సిరిని యాక్సెస్ చేయవచ్చు.

ఎంతో హై క్వాలిటీ మెటీరియల్ తో తయారుచేసిన ఇయర్ ఫోన్స్ కి మూడు జతల ఇయర్ బడ్స్ ఉచితంగా అందించనున్నారు. ఇయర్ బడ్స్ ను ఉపయోగించినపుడు మాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అతుక్కొని మెడ నుంచి కిందకు జారకుండా బిగుతుగా ఉంటుంది. ఇయర్ బడ్స్ హెచ్ డి సౌండ్ ను అందించనున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago