భారతీయ ఇయర్ ఫోన్స్ బ్రాండ్ మివీ మన దేశంలో సరికొత్త బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది.అవే మివీ కాలర్ క్లాసిక్. ఈ ఇయర్ ఫోన్స్ లో మూడు బటన్లను అందుబాటులో ఉంచారు. ఈ బటన్స్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేయడం,ఫోన్ కాల్స్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయడం వంటివి చేయవచ్చు.త్వరలోనే భారతదేశంలో తయారైన ఈ ఇయర్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభం కానున్నాయి.

మివీ తయారుచేసిన ఈ ఇయర్ ఫోన్స్ లో మూడు జతల బడ్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని మన సైజును బట్టి మార్చుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఇయర్ ఫోన్స్ ధర కేవలం ఫ్లిప్ కార్ట్ సేల్స్ ద్వారా రూ.999 గా నిర్ణయించారు.బ్లాక్, బ్లూ, గ్రీన్, గ్రే, ఆరెంజ్, రెడ్ రంగులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఇయర్ ఫోన్స్ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో కంపెనీ తెలియజేయడం లేదు.
ఇందులో బ్లూటూత్ వీ5.0 టెక్నాలజీని అందించడంతో పాటు బరువు కూడా చాలా తక్కువగా ఉండే విధంగా రూపొందించారు. ఈ బ్లూటూత్ లో ఉండే మూడు బటన్ ల ద్వారా పాటను వినడం లేదా ఫార్వర్డ్ చేయడం, ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం వంటి సదుపాయాలను కల్పించింది.ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ ఉంది. దీని ద్వారా గూగుల్ అసిస్టెంట్, సిరిని యాక్సెస్ చేయవచ్చు.
ఎంతో హై క్వాలిటీ మెటీరియల్ తో తయారుచేసిన ఇయర్ ఫోన్స్ కి మూడు జతల ఇయర్ బడ్స్ ఉచితంగా అందించనున్నారు. ఇయర్ బడ్స్ ను ఉపయోగించినపుడు మాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అతుక్కొని మెడ నుంచి కిందకు జారకుండా బిగుతుగా ఉంటుంది. ఇయర్ బడ్స్ హెచ్ డి సౌండ్ ను అందించనున్నాయి.































