Categories: FeaturedMovie News

నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి ఇంద్రజ..!!

బిగ్ బాస్ అనే రియాల్టీ షో బుల్లితెరపై ఎంతటి క్రేజ్ ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా ఈ షో గురించి చెప్పేదేముంది.. ఇక ముఖ్యంగా తెలుగులో కూడా ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది… అందుకే ఈ షో ప్రతి సీజన్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మరి ఇలాంటి షోలో పాల్గొనే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోలేరు అనుకుంటాం. కానీ, ఈ షోను రిజక్ట్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు.ఆ లిస్టులో మాజీ హీరోయిన్‌ ఇంద్రజ కూడా చేరింది. బిగ్‌ బాస్‌ నాల్గొ సీజన్‌ లో ఇంద్రజకు అవకాశం వచ్చిందట.

అయితే షోలో పాల్గొంటానికి ఆమె ఆసక్తి చూపించలేదట.ఒకప్పుడు హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ, ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా రాణించలేదు, అలాగే ఎలివేట్ అవ్వాల్సిన స్థాయిలో కూడా ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలగలేకపోయింది. ఇక గతకొద్ది కాలంగా సినిమాలలో తిరిగి నటించడానికి ఆసక్తి చూపిస్తోన్న ఇంద్రజ, ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా కూడా కనిపిస్తోంది.

అయితే తాజాగా ఆమె ఓ చానెల్‌ కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలోనే బిగ్‌ బాస్‌ షో పై తన మనసులోని మాటను మొత్తానికి బయట పెట్టింది ఈ సీనియర్ హీరోయిన్.మరి ఇంద్రజ మాటల్లోనే ‘నిజానికి ‘బిగ్‌ బాస్‌’ నాల్గో సీజన్‌ లో నాకు ఆఫర్‌ వచ్చింది. కానీ అప్పుడు నేను రాలేనని వారికీ చెప్పాను. అయితే బి బాస్ లోకి వెళ్లలేకపోవడానికి కారణం ఆ షో పై నెగిటివ్ భావన ఉండటం వల్ల కాదు. నా ఫ్యామిలీ ఇప్పటికీ చెన్నైలో ఉంటుంది. నేను నా ఫ్యామిలీని వదిలి.. నెలలు తరబడి నేను వేరే ప్రపంచంలో ఉండలేను అందుకే బిగ్‌బాస్‌లోకి వెళ్లలేదు’ అని చెప్పుకొచ్చింది.

మరి భవిష్యత్తులో మళ్ళీ బిగ్ బాస్ నుండి అవకాశం వస్తే వెళ్తారా అని అడిగితే.. ‘అవకాశం వచ్చినా నెను వెళ్లను. అయితే గెస్ట్‌గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌ నాగార్జునని చూడడానికే వెళ్తా’ అంటూ చిలిపి నవ్వు నవ్వింది. అన్నట్టు ఇంద్రజ నాగార్జునతో ఓ సూపర్ హిట్ సాంగ్ లో ఆడిపాడింది. ఇక ఇంద్రజకు నాగ్‌ హోస్టింగ్‌ చాలా బాగా అని అనిపిస్తోందట. నాగ్ ఇప్పటికీ స్టైలీష్‌గా, అందంగా ఉన్నారు’ అంటూ నాగార్జున పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇంద్రజ…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago