పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరీ ఈ మధ్య కాలంలో అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతోంది..ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన ఫాలోవర్స్ కి అలాగే ప్రజలకు దైర్యం చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ హీరోయిన్.. సమాజంలోని సమస్యల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు ఆమె.
ఈ క్రమంలోనే తాజాగా కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితి పై తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో తన శైలిలో స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ ను ప్రస్తుతం నెటిజన్లు షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ‘మనం మన బాధలను, ద్వేషాలను వంటి ఎమోషన్స్ ను లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందించడానికి మనం ఉన్నాం.
నిజమే ఇప్పుడున్న పరిస్థుతులను చూసుకుంటే మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఐతే ఆలోచించండి ఈ కష్టకాలం మరెంతో కాలం ఉండదు. ఎక్కువ రోజులు ఉండని దాని గురించి ఎందుకు భయం. కాల ప్రవాహంలో ఏదైనా మర్చిపోవాల్సిందే, మారిపోవాల్సిందే.. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే ఏది చేయాలో అదే చేయండి. ఎక్కువుగా స్టాండప్ కామెడీ వీడియోలను, లేదా క్యూట్ పప్పీ(కుక్కపిల్ల)ల వీడియోలను చూసి మీ కష్టాలను మర్చిపోండి.
ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి’ అంటూ మొత్తానికి రేణూ ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది.ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ బుల్లితెర పై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే ఒక సినిమాని డైరెక్ట్ కూడా చేస్తోంది. ఆల్ రెడీ రేణు దేశాయ్ మరాఠీలో ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే తన సినీ దర్శకత్వ జర్నీని టాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుంది. పైగా పవన్ మాజీ భార్యగా ఇక్కడ సాంకేతిక బృందం అన్ని విధాలుగా సినిమా కోసం సహకరిస్తారు. ఈ కారణాల వల్లే రేణు తెలుగు సినిమా చేస్తోందట రేణు దేశాయ్..!!
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…