పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య కి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరీ ఈ మధ్య కాలంలో అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతోంది..ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన ఫాలోవర్స్ కి అలాగే ప్రజలకు దైర్యం చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ హీరోయిన్.. సమాజంలోని సమస్యల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు ఆమె.

ఈ క్రమంలోనే తాజాగా కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితి పై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో తన శైలిలో స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ ను ప్రస్తుతం నెటిజన్లు షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. ‘మనం మన బాధలను, ద్వేషాలను వంటి ఎమోషన్స్ ను లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం భాధ పడటానికి ఈ శరీరం లేదు కదా.. బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందించడానికి మనం ఉన్నాం.

నిజమే ఇప్పుడున్న పరిస్థుతులను చూసుకుంటే మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఐతే ఆలోచించండి ఈ కష్టకాలం మరెంతో కాలం ఉండదు. ఎక్కువ రోజులు ఉండని దాని గురించి ఎందుకు భయం. కాల ప్రవాహంలో ఏదైనా మర్చిపోవాల్సిందే, మారిపోవాల్సిందే.. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే ఏది చేయాలో అదే చేయండి. ఎక్కువుగా స్టాండప్‌ కామెడీ వీడియోలను, లేదా క్యూట్‌ పప్పీ(కుక్కపిల్ల)ల వీడియోలను చూసి మీ కష్టాలను మర్చిపోండి.

ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి’ అంటూ మొత్తానికి రేణూ ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది.ఇక ప్రస్తుతం రేణు దేశాయ్‌ బుల్లితెర పై ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తూనే ఒక సినిమాని డైరెక్ట్ కూడా చేస్తోంది. ఆల్ రెడీ రేణు దేశాయ్ మరాఠీలో ఒక సినిమా తీస్తే.. అక్కడ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే తన సినీ దర్శకత్వ జర్నీని టాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగు సినిమా చేస్తే.. ఎంత లేదు అన్నా సినిమాకి ఫ్రీగా ఫుల్ పబ్లిసిటీ దొరుకుతుంది. పైగా పవన్ మాజీ భార్యగా ఇక్కడ సాంకేతిక బృందం అన్ని విధాలుగా సినిమా కోసం సహకరిస్తారు. ఈ కారణాల వల్లే రేణు తెలుగు సినిమా చేస్తోందట రేణు దేశాయ్..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here