తమిళ సినీ పరిశ్రమలో తల అజిత్ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో చెప్పనవసరం లేదు..ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు ఆ రోజు తమిళనాడు మొత్తం పండగే అని చెప్పాలి.. నిజానికి అజిత్ సినిమాల కోసం ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా తాజాగా అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమా అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అజిత్ ఫ్యాన్స్.
ఒకవిధంగా ఎదురుచూస్తున్నారు అనేకంటే, గత ఆర్నెళ్లుగా సినిమా అప్ డేట్ కోసం అతని అభిమానులు గోల గోల చేస్తున్నారు అనడం కరెక్ట్ ఏమో.అయితే, అభిమానుల ఎదురుచూపులను అర్ధం చేసుకున్న మేకర్స్, మొత్తానికి అజిత్ పుట్టిన రోజు స్పెషల్ గా మే 1న ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ, ఇప్పుడు వాళ్ళకి కరోనా షాక్ ఇచ్చింది. దేశమంతా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి టైంలో ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం కరెక్ట్ కాదని ఇప్పుడు ఫస్ట్ లుక్ వాయిదా వేశారని తెలుస్తోంది.ఈ నిర్ణయం స్వయంగా అజిత్ నే తీసుకున్నాడని.. ప్రజలు బాధలో ఉన్నప్పుడు.. సినిమా ప్రమోషన్స్ ను చేయడం బాగోదు అని, అందుకే ఇప్పుడు సినిమా నుండి ఎలాంటి అప్ డేట్లు ఇవ్వొద్దు అని అజిత్ దర్శకనిర్మాతలకు సూచించాడట. మొత్తానికి కరోనా వల్ల సినిమా విడుదలలు వాయిదా పడడమే కాదు ఇప్పుడు ఏకంగా ఫస్ట్ లుక్, టీజర్లు కూడా పొస్టుపోన్ అవుతున్నాయి.
అన్నట్టు ఈ మే1న అజిత్ తన 50వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఈ పుట్టినరోజు నాడు తమ హీరో నుండి కొత్త అప్ డేట్ వినబోతున్నామని అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ రచ్చలో ముఖ్యమైనది అజిత్ రాజకీయ రంగ ప్రవేశం గురించే అంటూ ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి…!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…