దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువైంది. అదేవిధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఆక్సిజన్ కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ వేలు, లక్షలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యాపారి కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ఆక్సిజన్ సిలిండర్ ను అందిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులలో ఆక్సిజన్ సిలిండర్ ధర మార్కెట్ లో దాదాపు 30,000 పలుకుతోంది. అలాంటిది ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని సుమెర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్‌జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ నడుపుతున్న మనోజ్ గుప్తా.. కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రూపాయికే కరోనా ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేసి ఇస్తున్నారు. ఇప్పటివరకు మనోజ్ గుప్తా వెయ్యి మంది కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా వ్యాపారి గుప్తా మాట్లాడుతూ గత ఏడాది 2020 వ సంవత్సరంలో తాను కరోనా బారిన పడినట్లు తెలియజేశారు. అయితే ఇప్పుడు కూడా తను ఆక్సిజన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.నా బాటిల్ ప్లాంట్‌కు రోజుకు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేసే సామర్థ్యం ఉంది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల కుటుంబికులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపిస్తేనే సిలిండర్ అందిస్తున్నట్లు మనోజ్ గుప్తా తెలిపారు.
మనోజ్ గుప్తా తన పెద్ద మనసుతో చేస్తున్న ఈ సహాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతని పెద్ద మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేస్తున్నారని తెలియడంతో ఝాన్సీ, బందా, లలిత్‌పూర్, కాన్పూర్, ఓరాయ్ తదితర ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…