రూపాయికే ఆక్సిజన్ సిలిండర్.. ఆ వ్యాపారికి సెల్యూట్ చేయాల్సిందే!

0
158

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువైంది. అదేవిధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఆక్సిజన్ కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అక్కడ వేలు, లక్షలు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యాపారి కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ఆక్సిజన్ సిలిండర్ ను అందిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులలో ఆక్సిజన్ సిలిండర్ ధర మార్కెట్ లో దాదాపు 30,000 పలుకుతోంది. అలాంటిది ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని సుమెర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్‌జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ నడుపుతున్న మనోజ్ గుప్తా.. కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రూపాయికే కరోనా ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేసి ఇస్తున్నారు. ఇప్పటివరకు మనోజ్ గుప్తా వెయ్యి మంది కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వ్యాపారి గుప్తా మాట్లాడుతూ గత ఏడాది 2020 వ సంవత్సరంలో తాను కరోనా బారిన పడినట్లు తెలియజేశారు. అయితే ఇప్పుడు కూడా తను ఆక్సిజన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.నా బాటిల్ ప్లాంట్‌కు రోజుకు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేసే సామర్థ్యం ఉంది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల కుటుంబికులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపిస్తేనే సిలిండర్ అందిస్తున్నట్లు మనోజ్ గుప్తా తెలిపారు.

మనోజ్ గుప్తా తన పెద్ద మనసుతో చేస్తున్న ఈ సహాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అతని పెద్ద మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేస్తున్నారని తెలియడంతో ఝాన్సీ, బందా, లలిత్‌పూర్, కాన్పూర్, ఓరాయ్ తదితర ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here