Tag Archives: Satya

Bigg Boss6: హౌస్ లో కొనసాగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అన్నయ్య అంటూ అర్జున్ ని ఇబ్బంది పెడుతున్న శ్రీ సత్య!

Bigg Boss6:బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారం కూడా పూర్తి కానుంది. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో లవ్ ట్రాక్స్ ఉండడం సర్వసాధారణం. ప్రతి సీజన్లోనూ ఏదో ఒక జంట ఇలా లవ్ లో పడటం మనం చూస్తున్నాము. అయితే సీజన్ సిక్స్ లో మాత్రం కాస్త భిన్నంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సూర్య ఆరోహి మధ్య బిగ్ బాస్ లవ్ ట్రాక్ భారీగా నడుపుతున్నారు. ఇకపోతే మరొక జంట శ్రీ సత్య వాసంతి అర్జున్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ నేహా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహాన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ అర్జున్ కి శ్రీ సత్య మీద ఏదో ఫీలింగ్ ఉంది కానీ ఆ అమ్మాయి మాత్రం బయటపడటం లేదు తరచూ తనని కావాలనే అన్నయ్య అంటూ అవాయిడ్ చేస్తుందని శ్రీహన్ పేర్కొన్నాడు.

Bigg Boss6: బ్రదర్ అంటూ అర్జున్ టార్చర్ చేస్తున్న శ్రీ సత్య…

ఈ విషయం విన్న నేహా వాసంతి కూడా అర్జున్ ను ఇష్టపడుతోంది. అర్జున్ బయటపడటం లేదు అని నేహా చెప్పగా అంటే వీరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా అని నేహా సందేహం వ్యక్తం చేస్తుంది. లవ్ విషయంలో చాలా కంట్రోల్ గా ఉండాలని తాను ఇదివరకే అర్జున్ కి చెప్పానని శ్రీహాన్ పేర్కొన్నారు. అయితే అర్జున్ శ్రీ సత్య పై ఇంట్రెస్ట్ చూపుతున్నారని, ఆ పిల్ల మాత్రం బ్రదర్ అంటూ తనని టార్చర్ పెడుతుందని నేహా, శ్రీహాన్ ఇద్దరూ ఈ లవ్ ట్రయాంగిల్ గురించి ముచ్చటించారు.