Bigg Boss6:బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారం కూడా పూర్తి కానుంది. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో లవ్ ట్రాక్స్ ఉండడం సర్వసాధారణం. ప్రతి సీజన్లోనూ ఏదో ఒక జంట ఇలా లవ్ లో పడటం మనం చూస్తున్నాము. అయితే సీజన్ సిక్స్ లో మాత్రం కాస్త భిన్నంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సూర్య ఆరోహి మధ్య బిగ్ బాస్ లవ్ ట్రాక్ భారీగా నడుపుతున్నారు. ఇకపోతే మరొక జంట శ్రీ సత్య వాసంతి అర్జున్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ నేహా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహాన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ అర్జున్ కి శ్రీ సత్య మీద ఏదో ఫీలింగ్ ఉంది కానీ ఆ అమ్మాయి మాత్రం బయటపడటం లేదు తరచూ తనని కావాలనే అన్నయ్య అంటూ అవాయిడ్ చేస్తుందని శ్రీహన్ పేర్కొన్నాడు.
ఈ విషయం విన్న నేహా వాసంతి కూడా అర్జున్ ను ఇష్టపడుతోంది. అర్జున్ బయటపడటం లేదు అని నేహా చెప్పగా అంటే వీరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా అని నేహా సందేహం వ్యక్తం చేస్తుంది. లవ్ విషయంలో చాలా కంట్రోల్ గా ఉండాలని తాను ఇదివరకే అర్జున్ కి చెప్పానని శ్రీహాన్ పేర్కొన్నారు. అయితే అర్జున్ శ్రీ సత్య పై ఇంట్రెస్ట్ చూపుతున్నారని, ఆ పిల్ల మాత్రం బ్రదర్ అంటూ తనని టార్చర్ పెడుతుందని నేహా, శ్రీహాన్ ఇద్దరూ ఈ లవ్ ట్రయాంగిల్ గురించి ముచ్చటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…