Tag Archives: scheme

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్… నెలకు రూ.1000తో 70,000 పొందే ఛాన్స్..?

ఈ మధ్య కాలంలో బ్యాంకులకు ధీటుగా పోస్టాఫీసులు సైతం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. కొత్త కొత్త సేవింగ్ స్కీమ్ ల ద్వారా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో రాబడి ఆశించే వాళ్లకు ఈ స్కీమ్ ల ద్వారా ప్రయోజనం కలగనుంది. పోస్టాఫీసులు అందించే ఉత్తమమైన స్కీమ్ లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.

ప్రతి నెలా నచ్చిన మొత్తంలో డబ్బులను సేవ్ చేసుకునే అవకాశాన్ని పోస్టాఫీస్ లు కల్పిస్తున్నాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం వల్ల రిస్క్ కూడా ఉండదు. 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉండే రికరింగ్ డిపాజిట్ ఖాతాకు మూడు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. సామాన్య, మధ్య తరగతి వర్గాల వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

ఉదాహరణకు ప్రతి నెలా 1,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తరువాత ఏకంగా 70,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెల చివరి వారంలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో నగదును జమ చేయవచ్చు. పోస్టాఫీస్ లో జమ చేసిన రికరింగ్ డిపాజిట్ పై టీడీఎస్ కూడా పడదు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మరికొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

ఎవరైనా డబ్బులు అవసరం అనుకుంటే స్కీమ్ ను ప్రారంభించిన ఏడాది తరువాత నగదును 50 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్ ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఎక్కువగా డబ్బులను పొందలేరు.

ఎల్ఐసీ సూపర్ పాలసీ.. జీవితాంతం డబ్బులు పొందే ఛాన్స్..!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ తాజాగా మరో కొత్త పాలసీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. జీవన్ శాంతి పేరుతో ఎల్ఐసీ నూతన పాలసీని ఆవిష్కరించింది. జీవన్ శాంతి పాలసీ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది ఇండివిజువల్ సింగిల్ ప్రీమియం ప్లాన్ కావడం గమనార్హం.

యాన్యుటీ రేట్లను జీవన్ శాంతి పాలసీని తీసుకునే సమయంలోనే నిర్ణయించుకోవచ్చు. ఈ పాలసీ ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం పాలసీ డబ్బులు వస్తాయి. మనం పాలసీ తీసుకున్న తరువాత ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులను పొందాలో ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ లోనే పాలసీలను కొనుగోలు చేయవచ్చు.

జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్, సింగిల్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్ లతో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఒక ఆప్షన్ ను ఎంపిక చేసుకుని మనం సులువుగా డబ్బు పొందవచ్చు. పాలసీ తీసుకున్న తరువాత ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే నామినీ డెత్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. కనీసం లక్షన్నర రూపాయలతో ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.

30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులు. నెల, 3 నెలలు, ఆరు నెలలు, 12 నెలల చొప్పున యాన్యుటీని పొందే అవకాశం ఉంటుంది. 5.5 శాతం రాబడితో ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఎవరైనా 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి పాలసీని తీసుకుంటే యాన్యుటీ రేటు పెరుగుతుంది. సంవత్సరానికి కనీసం 12,000 రూపాయలు యాన్యుటీ లభించే ఈ పాలసీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.