Tag Archives: Secunderabad

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

Railway Station: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆధునిక హంగుల్ని సమకూరుస్తోంది. ఎయిర్ పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీని కోసం కేంద్రం గతంలో కూడా ప్రతిపాదనలు చేసింది.

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

ఇండియన్ రైల్వే స్టేషన్స్ కార్పోరేషన్ ( ఐఆర్ఎస్డీసీ)కి రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణను అప్పగించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఆ బాధ్యతలను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ( ఆర్ఎల్డీఏ) కు అప్పగించినా ముందుకు పడలేదు.

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

చివరకు రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ బాధ్యతను ఆయా రైల్వే జోన్ల అధికారులకే అప్పగించారు. ఈసారి బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే లోని పలు స్టేషన్లను డెవలప్ చేసేందుకు రూ. 325 కోట్ల నిధులను కేటాయించింది.

అంతర్జాతీయ స్థాయి వసతులు ఏర్పాటు..

ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు… ఏపీలోని తిరుపతి, నెల్లూర్ స్టేషన్లను డెవలప్ చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రైల్వేకు గుండె కాయగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈపీసీ టెంటర్లను కూడా ఆహ్వానించింది. సికింద్రాబాద్ స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. స్టేషన్ లో పార్కింగ్ మొదలుకుని.. రైలు ఎక్కే వరకు అన్ని వ్యవస్థలను ఆధునీకీకరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలోనే  షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు నెలలోపు టెండర్లను పిలిచి.. మూడు నెలల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

Bigg Breaking: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం..! రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..!

Bigg Breaking: కొన్ని గంటల క్రితం తెల్లవారుజామున సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో మంటలు విపరీతంగా చెలరేగడంతో వారసత్వ కట్టడం ధ్వంసమైంది. ఆ క్లబ్ యొక్క ప్రధాన ముఖభాగం మంటల్లో కాలిపోయింది.షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం.

Bigg Breaking: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం..! రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..!

ప్రాథమిక విచారణలో దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం (16 జనవరి, 2022) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

Bigg Breaking: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం..! రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది..!

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు భారీగా ఎగిసిపడగా, అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు 3 గంటల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దాదాపు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని..

సికింద్రాబాద్ క్లబ్ 1879లో బ్రిటిష్ పాలనలో సైనిక అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఎలైట్ క్లబ్ 30 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో విస్తరించి ఉంది. ఇక్కడ 5000 మంది సభ్యులకు సభ్యత్వం ఉంది. సికింద్రాబాద్ క్లబ్‌లో దాదాపు 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అక్కడి అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా సికింద్రాబాద్ క్లబ్ చాలా రోజులుగా క్లోజ్ చేసి ఉంది. కరోనా ప్యాండమిక్ కారణంగా చాలా రోజులుగా క్లోజ్ ఉన్న క్లబ్ లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదు. కేసు నమోదు చేసుకున్న మారేడ్ పల్లి పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. అక్కడ ప్రాంతంలో రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో రోగులు..!

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది రోగులు ఉంటారు. రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండటంతో అక్కడికి ఎంతో మంది పేదలు వారి వైద్యానికి సంబంధించి ట్రీట్ మెంట్ కోసం వస్తుంటారు. ఈ రోజు ఉదయం అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ లేబర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అక్కడి ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. భయంతో అక్కడి రోగులు బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న లేబర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

ఆ మంటలను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వాళ్లు వచ్చే లోపే కొంతమంది రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఇలా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.

మొదట మంటలు వస్తున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో.. ఆసుపత్రి సిబ్బందే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వాళ్లే అక్కడ ఉన్న చాలామంది రోగులను కాపాడారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.