Categories: General News

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

Railway Station: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఆధునిక హంగుల్ని సమకూరుస్తోంది. ఎయిర్ పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్లను డెవలప్మెంట్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీని కోసం కేంద్రం గతంలో కూడా ప్రతిపాదనలు చేసింది.

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

ఇండియన్ రైల్వే స్టేషన్స్ కార్పోరేషన్ ( ఐఆర్ఎస్డీసీ)కి రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణను అప్పగించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఆ బాధ్యతలను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ( ఆర్ఎల్డీఏ) కు అప్పగించినా ముందుకు పడలేదు.

Railway Station: సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఎయిర్‌పోర్టు లుక్‌..! తాజాగా టెండర్లకు ఆహ్వానం..?

చివరకు రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ బాధ్యతను ఆయా రైల్వే జోన్ల అధికారులకే అప్పగించారు. ఈసారి బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే లోని పలు స్టేషన్లను డెవలప్ చేసేందుకు రూ. 325 కోట్ల నిధులను కేటాయించింది.

అంతర్జాతీయ స్థాయి వసతులు ఏర్పాటు..

ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు… ఏపీలోని తిరుపతి, నెల్లూర్ స్టేషన్లను డెవలప్ చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రైల్వేకు గుండె కాయగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ ను మరింతగా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఈపీసీ టెంటర్లను కూడా ఆహ్వానించింది. సికింద్రాబాద్ స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. స్టేషన్ లో పార్కింగ్ మొదలుకుని.. రైలు ఎక్కే వరకు అన్ని వ్యవస్థలను ఆధునీకీకరించనున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలోనే  షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులకు నెలలోపు టెండర్లను పిలిచి.. మూడు నెలల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago