TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!
TDP-Congress: రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరని చాలా సార్లు పెద్దలు చెబుతుంటారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాటను చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మొదటి నుంచి కూడా టీడీపీ, కాంగ్రెస్ ఒకరినొకరు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్నాయి.
2019లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా బద్ద శత్రువులుగా భావించిన ఈ రెండు పార్టీలు కలిసి పోయి మరీ పోటీ చేశాయి. ఇక ఇదే తరహా పంథాను త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి.
ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ విషయాలను వెల్లడించారు. అండమాన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా మున్సిపాలిటీలోని వార్డులను పంచుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి చేయాలనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ వచ్చేనెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.. మార్చి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమావేశంలో రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని.. ప్రజాస్వామ్యయుత పాలన కోసం తాము టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బరిలో దిగనున్నామన్నారు. తమను ప్రజలు ఆదరించాలని కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…