Narayana: ‘‘అందుకే నాగార్జున అంటే అసహ్యం.. " నాగార్జునపై సీపీఐ నేత నారాయణ ఫైర్..!
CPI Narayana: బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో అంత కంటే ఎక్కువగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. బిగ్ బాస్ రియాల్ట షో అనేది దేనికి ఉపయోగపడదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించి ఇప్పటికే అప్ డేట్ వచ్చేసింది. దీనిలో పాల్గొనే వ్యక్తుల పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టిక్ టాక్ దుర్గారావు, రఘుమాస్టర్, సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సహా మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సారి ఈ షోను ఓటీటీలో ప్రసారం కానుండగా .. ఓటీటీలో 24 గంటల పాటూ ప్రసారం చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది. దీని హోస్ట్ నాగార్జునపై నారాయణ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు.
గతంలో నారాయణ ఎన్నో సార్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అది బిగ్ బాస్ షో కాదని బ్రోతల్ హౌస్ అని నారాయణ ఆరోపించారు. తాజాగా మరో సారి నాగార్జునపై మండిపడ్డాడు. నాగార్జున అంటే కోపం లేదని.. కానీ అతడంటే అసహ్యం అంటూ వ్యంగ్యంగా విమర్శించాడు. పెళ్లి ఎవరిని చేసుకుంటావ్.. డేటింగ్ ఎవరితో చేస్తావ్…. ఇలాంటి మాటలేనా.. బిగ్ బాస్ అంటే అంటూ మండిపడ్డాడు. అంతే కాకుండా.. అతడు ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు దండం పెట్టే ఫొటోలను ట్రోల్స్ చేశారని అన్నారు. కమ్యూనిస్టులు అంటే.. మాసిన గడ్డంతో ఉంటారనే భ్రమలో ఉన్నారని.. అది ఏ మాత్రం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. ఎంతో మందికి కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని.. అందులో చిన జీయర్ కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…