Tag Archives: Shankar Dada MBBS

Srikanth: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నటించాల్సింది నేను కాదు.. చిరంజీవి అన్నయ్య ఇంటికి వెళ్లి అడిగితే ఆయన ఏమన్నారంటే.. : హీరో శ్రీకాంత్

Srikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవిని శ్రీకాంత్ ఎంతగానో ఆరాధిస్తారని అందరికీ తెలిసిందే. నిత్యం అన్నయ్య అన్నయ్య అంటూ శ్రీకాంత్ చిరంజీవిని ఆరాధిస్తారు.

Sreekanth: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నటించాల్సింది నేను కాదు.. అసలు విషయం చెప్పిన శ్రీకాంత్?

ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి శ్రీకాంత్ మొట్టమొదటిసారిగా శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో మాత్రమే నటించానని తెలిపారు. అయితే ముందుగా ఈ పాత్రలో నటించాల్సిందిగా తాను కాదని తన స్థానంలో వేరే వాళ్ళని అనుకున్నారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Sreekanth: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో నటించాల్సింది నేను కాదు.. అసలు విషయం చెప్పిన శ్రీకాంత్?

ఇక ఈ సినిమా షూటింగ్ కి ముందు మామూలుగానే చిరంజీవి ఇంటికి వెళ్లి అతనితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాను. ఇలా మాటల మధ్యలో ఏంటి అన్నయ్య.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగాను. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ వచ్చేనెల లేదా ఆ తర్వాత నెలలో స్టార్ట్ అవుతుందిరా… ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్నయ్య అని అడిగా.. నువ్వు చేస్తావా అని అడిగారు. చిరంజీవి గారు అలా అడగడంతో ఇంతకన్నా పుణ్యమా, అందుకే వచ్చానన్నయ్య అని చెప్పేసాను.

బాండింగ్ బాగుంటుంది..

ఇలా నేను చెప్పే సరికి వెంటనే జెమిని కిరణ్ కి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ శ్రీ తో వేద్దాం చాలా బాగుంటుంది. బాండింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అలా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలో నాకు అవకాశం వచ్చిందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు. ఇక ఈ సినిమా తర్వాత శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా శ్రీకాంత్ సందడి చేశారు.