Srikanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవిని శ్రీకాంత్ ఎంతగానో ఆరాధిస్తారని అందరికీ తెలిసిందే. నిత్యం అన్నయ్య అన్నయ్య అంటూ శ్రీకాంత్ చిరంజీవిని ఆరాధిస్తారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి శ్రీకాంత్ మొట్టమొదటిసారిగా శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో మాత్రమే నటించానని తెలిపారు. అయితే ముందుగా ఈ పాత్రలో నటించాల్సిందిగా తాను కాదని తన స్థానంలో వేరే వాళ్ళని అనుకున్నారని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కి ముందు మామూలుగానే చిరంజీవి ఇంటికి వెళ్లి అతనితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాను. ఇలా మాటల మధ్యలో ఏంటి అన్నయ్య.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగాను. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ వచ్చేనెల లేదా ఆ తర్వాత నెలలో స్టార్ట్ అవుతుందిరా… ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్నయ్య అని అడిగా.. నువ్వు చేస్తావా అని అడిగారు. చిరంజీవి గారు అలా అడగడంతో ఇంతకన్నా పుణ్యమా, అందుకే వచ్చానన్నయ్య అని చెప్పేసాను.
ఇలా నేను చెప్పే సరికి వెంటనే జెమిని కిరణ్ కి ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ శ్రీ తో వేద్దాం చాలా బాగుంటుంది. బాండింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అలా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలో నాకు అవకాశం వచ్చిందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు. ఇక ఈ సినిమా తర్వాత శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా శ్రీకాంత్ సందడి చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…