Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన వెంకటేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 సినిమా ఈ నెల 27వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఎఫ్ 3 సినిమా కోసం వెంకటేష్ మూడింతల అధిక పారితోషికం తీసుకున్నారని, వెంకటేష్ సినీ కెరియర్ లోనే ఇదే ఎక్కువ పారితోషికం అని తెలుస్తుంది. ఎఫ్ 2 సినిమా కోసం ఈయన 7 కోట్ల పారితోషికం తీసుకోగా, ఎఫ్ 3 సినిమా కోసం మూడింతలు అధికంగా పారితోషికం అంటే 21 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా వెంకటేష్ తన సినీ కెరీర్ లో 21 కోట్లు పారితోషికం తీసుకున్న మొట్టమొదటి సినిమా ఇదేనని, ఇంతవరకు వెంకటేష్ ఏ సినిమాకి ఇంత పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. మరి ఈ సినిమా ద్వారా వెంకటేశ్వర ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…