Tag Archives: shankarabharanam

Actor Brahmaji: నటుడు బ్రహ్మాజీ పిల్లలు వద్దనుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న బ్రహ్మాజీ కామెంట్స్!

Actor Brahmaji: ఎన్నో తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలోను సహాయ నటుడిగా కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు బ్రహ్మాజీ.ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈయన సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ తన తండ్రి ఒక తహసిల్దారని,తన తండ్రితో పాటు నటుడు సోమయాజులు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అని తెలిపారు. అయితే అప్పట్లో నటుడు సోమయాజులు నటించిన శంకరాభరణం విడుదల అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనని అందరూ పెద్ద ఎత్తున సన్మానించారు. ఆ సంఘటన చూసిన తనకు సినిమాలలోకి పోతే ఇంత గౌరవం ఉంటుందా అనిపించి చదువు పూర్తి కాగానే చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు.తాను చెన్నైలో ఉన్నప్పుడే ఒక బెంగాలీ అమ్మాయితో తనకు పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమ వరకు దారి తీసిందని తెలిపారు.ఇక తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి తనని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మాజీ పేర్కొన్నారు.ఇకపోతే నేను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి తనకు ఇదివరకే పెళ్లి జరిగి విడాకులు కూడా తీసుకుంది.

Actor Brahmaji: పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము..

ఈ విధంగా విడాకులు తీసుకునే సమయానికి తనుకు ఒక బాబు కూడా ఉన్నారు. ఇలా ముందుగానే ఒక బాబు ఉండడంతో మరి పిల్లలు ఎందుకు అన్న ఉద్దేశంతో తాను పిల్లల్ని వద్దనుకున్నానని ఈ సందర్భంగా బ్రహ్మాజీ వెల్లడించారు. ఆ అబ్బాయి ప్రస్తుతం పిట్టకథలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని, ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శంకరాభరణం రాజ్యలక్ష్మికి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా..?

నటి రాజ్యలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది రాజ్యలక్ష్మి. 1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్న సమయంలో ఆమె తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రంలోని శారద పాత్రకోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది.

నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి. మొదటి సనిమాతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె ‘శంక‌రాభ‌ర‌ణం’ను ఇంటిపేరుగా మార్చుకొని ‘శంక‌రాభ‌ర‌ణం రాజ్య‌ల‌క్ష్మి’గా పాపుల‌ర్ అయ్యారు.

ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్ తో నిప్పులాంటి నిజం సినిమాలో నటించారు. తర్వాత ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ అనే సినిమాలో బాలయ్యతో నటించారు. 1990 లో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అయితే అక్కడ సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది.. కానీ నటనను మాత్రం వదల్లేదు. 1999లో ఆమె తమిళంలోనో ఓ సీరియల్ లో నటనకు ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా ల‌భించింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు(రోహిత్, రాహుల్) జన్మించారు. చిన్నతనం కాబట్టి వాళ్ల ఆలనా పాలనా చూసుకోవడానికి సమయం ఎక్కువగా కేటాయించేవారు.

వాళ్లు పెరిగి పెద్ద అయిన తర్వాత తిరిగి 2004 లో వీరు చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు, సీరియల్స్ లల్లో నటిగా కొనసాగించింది. అయితే ఆమె పెళ్లి అంత సింపుల్ గా జరగలేదు. ఓ రోజు తన కుటుంబంతో డిన్నర్ కు వెళ్లినప్పడు అక్కడ ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడు సింగపూర్ లో ఉంటాడని ఆమె తెలుసుకున్నారు. తనకు సింగపూర్ లో షూటింగ్ ఉంటుందని అతడికి చెప్పగా.. మీరు వస్తే.. మమ్మల్ని మీట్ అవ్వండి అంటూ విసిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇలా ఆమె సింగపూర్ వెళ్లినప్పడు అతడిని కలవడం.. రాజ్యలక్ష్మి వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చడం జరిగిపోయాయి. ఇలా ఓ డిన్నర్ వద్ద పరిచయమైన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇతరుల సినిమాల్లో నటించకపోడానికి కారణం ఏమిటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “నేరము -శిక్ష” సినిమా ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ఈ సినిమాతో హీరోగా మారారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఆర్ నారాయణ మూర్తి ఆ తర్వాత దర్శకుడిగా మారారు.

ఈ క్రమంలోనే నారాయణమూర్తి దర్శకత్వంలో ఆయన నటుడిగా నటిస్తూ తెరకెక్కిన చిత్రం “అర్ధరాత్రి స్వతంత్రం”. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలను నిజ జీవితానికి ఆధారంగా సామాజిక అంశాలతో, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించే వారు. ఈ విధంగా నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్రసైన్యం, భూపోరాటం, అడవి దివిటీలు, చీమలదండు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు పొందాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మంచి నటుడిగా దర్శకుడిగా కొనసాగిన ఆర్.నారాయణమూర్తి సినిమాలకు ప్రస్తుతం పెద్దగా ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు. ఈయన సినిమాలకు ఆదరణ లేకున్నప్పటికీ ఇతనికి పలు దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. కొందరి దర్శకులు వారి సినిమాలలో నారాయణమూర్తికి ప్రత్యేక పాత్రలో నటించమని అవకాశం కల్పించినప్పటికీ నారాయణమూర్తి దర్శకులకు ఎంతో సున్నితంగా సినిమాలలో నటించినని చెప్పేశారు.

నారాయణ మూర్తి కేవలం తన సినిమాలలో మాత్రమే నటించేవారు. ఇతర దర్శకులు సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్నా నటించక పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇతర దర్శకుల సినిమాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నా మనసుకు నచ్చకుండా నటించడం వల్ల ఎక్కువ సార్లు టేకులు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలాసార్లు టేకులు తీసుకున్నప్పుడు నామీద నాకే అసహ్యం కలుగుతుంది.

నాతో సినిమా తీయాలంటే “ఒమర్ ముఖ్తార్” వంటి సినిమా అయిన తీయాలి లేకపోతే శంకరాభరణం సినిమాలో జె.వి.సోమయాజులు వంటి పాత్ర అయినా ఇవ్వాలి అంతే కానీ మిగతా ఏ పాత్రలో నటించడానికి కూడా తన మనసు ఒప్పుకోదని అందుకోసమే తాను తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో తప్ప ఇతర దర్శకుల సినిమాల్లో నటించనని ఓ సందర్భంలో ఆర్. నారాయణమూర్తి తెలియజేశారు.