Tag Archives: Shiva movies

Custody Movie: నాగార్జున శివ సినిమాల కస్టడీ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది: డైరెక్టర్ వెంకట్ ప్రభు

Custody Movie: అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశారు.

మొదటిసారి నాగచైతన్య నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో తమిళంలో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ సినిమా గురించి తెలియజేశారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతుందని తెలియజేశారు.

Custody Movie: నాగచైతన్య కెరియర్లో గుర్తుండిపోతుంది…


తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమాని చూసిన సంతృప్తి కస్టడీ సినిమా ప్రేక్షకులకు కలిగిస్తుందని వెంకట్ ప్రభు తెలియజేశారు. నాగార్జున సినీ కెరియర్లు శివ సినిమా ఎలా అయితే గుర్తుండిపోయిందో నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా కస్టడీ సినిమా అలాగే గుర్తుండిపోతుంది అంటూ ఈ సందర్భంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.