Custody Movie: అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా విశేషాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశారు.
మొదటిసారి నాగచైతన్య నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో తమిళంలో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ సినిమా గురించి తెలియజేశారు. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతుందని తెలియజేశారు.
తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమాని చూసిన సంతృప్తి కస్టడీ సినిమా ప్రేక్షకులకు కలిగిస్తుందని వెంకట్ ప్రభు తెలియజేశారు. నాగార్జున సినీ కెరియర్లు శివ సినిమా ఎలా అయితే గుర్తుండిపోయిందో నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా కస్టడీ సినిమా అలాగే గుర్తుండిపోతుంది అంటూ ఈ సందర్భంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…