Tag Archives: Shortage

భారత్ లోని కరోనా రోగులకు మరో షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో భారత్ లోని కరోనా రోగులకు ఊహించని ఉపద్రవం ముంచుకొస్తోంది.

దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన రోగుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ల ద్వారా సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించడం సాధ్యమవుతుంది. దేశంలో కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం కొన్ని లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంది.

అయితే మనుషులతో పాటు గ్యాస్, స్టీల్ పరిశ్రమలు కూడా ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సిలిండర్లను తగ్గించి వైద్య చికిత్స కోసం వినియోగిస్తున్నా దాదాపు 3,000 మెట్రిక్ టన్నుల కొరత సెప్టెంబర్ నాటికే ఏర్పడిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు కావాల్సిన ఆక్సిజన్ కొరత ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 5 శాతం కేసులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది.

గతంతో పోలిస్తే ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం ఏడెనిమిది రెట్లు పెరిగిందని సమాచారం. ఆక్సిజన్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అదే స్థాయిలో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. ఉత్పత్తిని పెంచలేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగుల ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేద్.