Tag Archives: shoulders

Myositis Disease: సమంత బాధపడుతున్న మయోసిటీస్ వ్యాధి అంటే ఏంటి… దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

Myositis Disease: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత సోషల్ మీడియా వేదికగా పిడుగులాంటి వార్తను చెప్పారు.గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనంటూ శనివారం సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు కంగారు పడ్డారు.

ఈ క్రమంలోనే సమంత తాను గత కొంతకాలం నుంచి మయోసిటీస్ తో బాధపడుతున్నానని త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈమె వ్యాధి పట్ల స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.ఇలా సమంత ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే ఎంతోమంది నెటిజన్లు అసలు సమంత బాధపడుతున్న ఈ వ్యాధి అంటే ఏంటి ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అనే విషయంపై సెర్చ్ చేస్తున్నారు.

సాధారణంగా మయోసిటీస్ అనేది మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థలోవచ్చే సమస్య కారణంగా సోకుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధి రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి పోలీమ్యోసిటిస్‌. ఇది శరీరంలోని వివిధ రకాల కండరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ముఖ్యంగా నడుము భుజాలు తొడ కండరాలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు నీరసించిపోవడం త్వరగా అలసిపోవడం నిలబడలేక పోవడం కూర్చోలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది మహిళలలో 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారిలో సోకుతుంది.

Myositis Disease: తీవ్రమైన కండరాల నొప్పులను కలిగిస్తుంది..

ఇక రెండవది డెర్మటోమ్యోసిటిస్‌. ఇది కండరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా శరీరంపై దద్దుర్లను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకే ముందు చర్మంపై ఎర్రటి నలుపు దద్దుర్లు ఏర్పడటం జరుగుతుంది. కండరాలు నొప్పులు రావడం, చర్మంపై బుగ్గలపై రొమ్ముపై భాగంలో కళ్ళపై ఎర్రటి లేదా నలుపు రంగు, దద్దుర్లు ఏర్పడుతూ ఉంటాయి. చర్మం కింది భాగంలో ఒక గుజ్జు లాంటి పదార్థాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఇలా ఈ వ్యాధి లక్షణాలు మహిళలతో పాటు పిల్లలలో అధిక భాగంలో ఉంటాయి. ఇక సమంత ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నారని తెలియడంతో అభిమానులు ఆమె తొందరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున దేవుని ప్రార్థిస్తున్నారు.