Myositis Disease: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత సోషల్ మీడియా వేదికగా పిడుగులాంటి వార్తను చెప్పారు.గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనంటూ శనివారం సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు కంగారు పడ్డారు.
ఈ క్రమంలోనే సమంత తాను గత కొంతకాలం నుంచి మయోసిటీస్ తో బాధపడుతున్నానని త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈమె వ్యాధి పట్ల స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.ఇలా సమంత ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తెలియగానే ఎంతోమంది నెటిజన్లు అసలు సమంత బాధపడుతున్న ఈ వ్యాధి అంటే ఏంటి ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అనే విషయంపై సెర్చ్ చేస్తున్నారు.
సాధారణంగా మయోసిటీస్ అనేది మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థలోవచ్చే సమస్య కారణంగా సోకుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యాధి రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది. ఒకటి పోలీమ్యోసిటిస్. ఇది శరీరంలోని వివిధ రకాల కండరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.ముఖ్యంగా నడుము భుజాలు తొడ కండరాలపై ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు నీరసించిపోవడం త్వరగా అలసిపోవడం నిలబడలేక పోవడం కూర్చోలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది మహిళలలో 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారిలో సోకుతుంది.
ఇక రెండవది డెర్మటోమ్యోసిటిస్. ఇది కండరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా శరీరంపై దద్దుర్లను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకే ముందు చర్మంపై ఎర్రటి నలుపు దద్దుర్లు ఏర్పడటం జరుగుతుంది. కండరాలు నొప్పులు రావడం, చర్మంపై బుగ్గలపై రొమ్ముపై భాగంలో కళ్ళపై ఎర్రటి లేదా నలుపు రంగు, దద్దుర్లు ఏర్పడుతూ ఉంటాయి. చర్మం కింది భాగంలో ఒక గుజ్జు లాంటి పదార్థాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఇలా ఈ వ్యాధి లక్షణాలు మహిళలతో పాటు పిల్లలలో అధిక భాగంలో ఉంటాయి. ఇక సమంత ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్నారని తెలియడంతో అభిమానులు ఆమె తొందరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున దేవుని ప్రార్థిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…