Nagababu: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగబాబు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. హీరోగా ఈయన నటించినప్పటికీ సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా మారారు. ఇక ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉన్నారు.
ఇలా నిర్మాతగా నాగబాబు దూరమైనప్పటికీ సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తున్నారు. ఈయన ఎక్కువగా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక నాగబాబు ఒకరోజు లొకేషన్ లో షూటింగ్లో పాల్గొంటే 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇలా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ విధంగా నాగబాబు టీవీ కార్యక్రమాల ద్వారా బాగా ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని నాగబాబు సుమారు 100 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం. నాకు బాబు కుమారుడు వరుణ్ తేజ్ సైతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన కూడా ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా కొనసాగుతూనే నాగబాబు భారీగానే ఆస్తులు కూడా పెట్టారు. ఇక ఈయన తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ మెగా హీరోల గురించి మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే పెద్ద ఎత్తున ఆ విమర్శలను తిప్పికొడుతూ మెగా ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…