Featured

Senior Journalist Bhardwaja : చావు తప్పి కన్నులోట్టబోయిన చిరంజీవి… గాడ్ ఫాదర్ ఫైనల్ కలెక్షన్స్ ఇవే… సంక్రాంతికి బాలయ్యతో పోటీ పడతాడా?? – సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ఆకలితో ఉన్న వ్యక్తికి బిర్యానీ దొరికినట్లు ‘ఆచార్య’ తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు ‘గాడ్ ఫాదర్’ బిర్యానీలా దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి చూపించి డైరెక్టర్ ఫ్యాన్స్ ని మెప్పించాడు. చిరుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు అయితే సినిమాలో చిరుని కొత్తగా చూపించడం, మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచి సక్సెస్ అయ్యాడు కానీ సినిమా కలెక్షన్స్ మాత్రం ఆశించినంత రాలేదు. గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా 55 కోట్లుగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ చెప్పారు.

సంక్రాంతికి బాలయ్యతో పోటీ పడతాడా…

మెగాస్టార్ ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రౌడ్ పుల్లర్, మంచి హిట్లతో ఇండస్ట్రీని నిలబెట్టిన వ్యక్తి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చాక చిరుకి మంచి హిట్స్, ఆయన రేంజ్ హిట్స్ పడలేదు. ఇక ఈ మధ్య వచ్చిన ఆచార్య లాంటి సినిమాలు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. అయితే గాడ్ ఫాదర్ మాత్రం చిరు కి కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. కానీ ఫైనల్ కలెక్షమ్స్ మాత్రం చిరు రేంజ్ కాదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఆయన కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా తీసుకోవడం అవసరం అని సూచించారు. ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్ రావాలంటే ఆ సినిమా చాలా బాగుండాలి, థియేటర్లో మాత్రే చూడాలి సినిమా అని వారికి అనిపిస్తేనే చూస్తున్నారు లేదంటే ఓటిటి, టీవీల మీద ఆధారపడుతున్నారు. టికెట్ రేట్లు ఒక కారణం అయితే ఓటిటి సినిమా వసూళ్లు తగ్గడానికి మరో కారణం.

వరుసగా 50 కోట్లు వసూలు చేస్తున్న హీరోగానే ఉన్నా చిరు ఇప్పటి కుర్ర హీరోలలాగా 100 కోట్ల క్లబ్ కి వెళ్లడం ఇలాంటి సినిమాలను నమ్ముకుంటే కష్టం అంటూ అభిప్రాయపడ్డారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మీద గాడ్ ఫాదర్ ప్రభావం పడవచ్చు. సంక్రాంతికి బరిలో బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ తో వస్తున్నాడు. బాలకృష్ణ అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లు వసూలు చేసింది. ఇక అన్ స్టాపబల్ తో మంచి ఊపు మీద బాలయ్య ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఈజీ గా తెచ్చుకోగలుగుతాడు. మరి అలాంటి సినిమాతో పోటీ పడి గెలవగల సినిమా వాల్తేరు వీరయ్య అవుతుందా లేదా చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago