Featured

Imandi Ramarao : చిరంజీవి కి అర్జెంటుగా ఒక అల్లు అరవింద్ కావాలి : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Imandi Ramarao : మెగా-అల్లు కుటుంబాలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా ఉన్నా మెగా గొడుగు కిందనే ఇన్నేళ్లు అల్లు ఫ్యామిలీ ఉంది. మెగాస్టార్ అల్లు అరవింద్ వీరి కాంబినేషన్ అంటే కమర్షియల్ సక్సెస్ అనేలా ఉంటుంది. ఇక మెగాస్టార్ సినిమా చేయడం వరకు ఉంటే అల్లు అరవింద్ బిజినెస్ మొత్తం చూసుకుంటారు, మంచి వ్యూహకర్త. అలాంటి మెగాస్టార్, అల్లు అరవింద్ కలిసి లేరు దారులు వేరయ్యాయి అంటూ రోజుకో వార్త వస్తూనే ఉంది. ఇక చిరంజీవి గారు అల్లుడు అల్లు అర్జున్ ని కుడా కొడుకు రామ్ చరణ్ తో సమానంగా ప్రమోట్ చేసారు. సినిమాల్లోకి మెగా హీరోగానే బన్నీ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ నుండి పక్కకు జరుగుతోంది. ఇక ఈ విషయం మీద ఇరు కుటుంబాల నుండి ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు అల్లేస్తున్నారు.

చిరంజీవి కి ప్రస్తుతం అల్లు అరవింద్ కావాలి…

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఈ ఇష్యూ గురించి విశ్లేషిస్తూ అల్లు అరవింద్ మంచి వ్యూహకర్త, బిజినెస్ బాగా తెలిసిన వాడు. ఏ రంగంలో అయినా సక్సెస్ అయి వచ్చే తెలివితేటలు ఉన్న వ్యక్తి. అయితే చిరుకి వ్యాపారం అంతగా తెలియదు, కొడుకు రామ్ చరణ్ వ్యాపారం చేయగలడు కానీ చిరు కి అంతగా పట్టు లేదు అంటూ అభిప్రాయపడ్డారు. నిజానికి అల్లు అరవింద్ చిరు ఇద్దరూ కూడా ఒకరి కెరీర్ కి ఒకరు దోహదపడ్డారు. ఇప్పుడు చిరంజీవి గారికి పెద్దగా సక్సెస్ లు రావడం లేదు అందుకే ఆయనకు మళ్ళీ అల్లు అరవింద్ లాంటి ఒక వ్యక్తి అవసరం ఉంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అయితే అల్లు అరవింద్ ఆయన కొడుకు బన్నీ ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉన్నారు. ఇక అల్లు అరవింద్ అయితే ఆహా కి నందమూరి బాలకృష్ణ ను తీసుకువచ్చి ఆహా ఒరిజినల్స్ నే సక్సెస్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలకృష్ణ ను కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిధిగా పిలిచి ఆశ్చర్య పరిచాడు. బాలకృష్ణతో స్నేహం వల్ల అల్లు అరవింద్ కి బన్నీ ఫ్యాన్స్ తో పాటు బాలయ్య ఫ్యాన్స్ తోడైయ్యారు. అయితే చిరంజీవి విషయంలో ఒక సలహా ఇచ్చే వ్యక్తి పక్కన లేరు. ప్రస్తుతం ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి, ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ కూడా మెగాస్టార్ రేంజ్ హిట్ కాదు. అందుకే అల్లు అరవింద్ లాంటి వ్యూహకర్త ప్రస్తుతం చిరుకి అవసరం అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago