Tag Archives: silk smitha

Silk Smitha: అచ్చం సిల్క్ స్మితని తలపించే అందం.. సిల్క్ స్మిత బ్రతికే ఉందా?

Silk Smitha: గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి తెలియని వారంటూ ఉండరు. బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఆ రోజుల్లో యువకుల గుండెల్లో మంటలు రేపింది. ఈమె తన అందాలతో , మత్తెక్కించే కళ్లతోనే అందరినీ మాయ చేస్తూ హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయం భాషలలో ఎందరో స్టార్ హీరోలతో జత కట్టింది.

స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎమిటో మనకి అర్థమవుతుంది. ఏ హీరో సినిమా అయినా సరే సిల్క్ స్మిత పాట తప్పకుండా ఉండాలి . ఆమె పాట ఉంటేనే సినిమా హిట్టు అవుతుందని అనే నమ్మకం ఏర్పడింది. స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువ స్టార్‌డం సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో తన అందాలతో ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.

ఇప్పటికీ ఆమె లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. అయితే సిల్క్ స్మిత లేని లోటు పూర్తి చేయడానికి మళ్లీ ఇన్నేళ్లకు సిల్క్‌ స్మితే జనాల ముందుకు వచ్చేసింది. అచ్చం సిల్క్ స్మితని పోలిన అందంతో జూనియర్ సిల్క్ స్మిత అందరిని అలరిస్తోంది.ఈమెను చూస్తే నిజంగా సిల్క్‌ స్మితనే మళ్ళీ పుట్టిందా అనిపిస్తుంది . అదేలా సాధ్యం అంటే.. ఇదుగో ఇలా అంటుంది జూనియర్‌ సిల్క్‌ స్మిత అలియాస్‌ విష్ణు ప్రియ. ఫేస్‌కట్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్‌ స్మితను గుర్తు చేస్తోన్న విష్ణు ప్రియ అనే యువతీ టిక్ టాక్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.

Silk Smitha: సిల్క్ స్మిత పోలికలతో విష్ణు ప్రియ…


తిరుపతికి చెందిన విష్ణు ప్రియ అచ్చం సిల్క్ స్మిత లాగా ఉండటంతో టిక్ టాక్ వీడియోస్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడికి తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ సిల్క్ స్మిత తాను అలా ఉండటానికి గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక ఈమెను చూసిన అభిమానులు సిల్క్ స్మిత బ్రతికే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Silk Smitha: ఆ టార్చర్ భరించలేను.. ఆత్మహత్యకు ముందు సిల్క్ స్మిత రాసిన లెటర్ వైరల్!

Silk Smitha: తన మత్తెక్కించే కళ్ళతో యువకుల గుండెల్లో మంటలు రేపిన అందాల సుందరి సిల్క్ స్మిత గురించి తెలియని వారంటూ ఉండరు. సౌత్ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ రజనీకాంత్ వంటి ఎందరో స్టార్ హీరోలతో కలిసి 100 కు పైగా సినిమాలలో నటించిన సిల్క్ స్మిత తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. సిల్క్ స్మిత అకాల మరణం అప్పట్లో సంచలనంగా మారింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆమె లేని లోటు ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు. సిల్క్ స్మిత అలా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆత్మహత్యకి ముందు సిల్క్ స్మిత రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు ఆమె రాసిన ఉత్తరం స్వాధీనం చేసుకున్నారు.

సిల్క్ స్మిత ఆ లెటర్ లో తన బాధని బయటపెట్టింది. ఆ లెటర్ లో ” నా ఏడవ ఏట నుండే పొట్టకూటి కోసం ఒంటరిగా కష్టపడుతున్నాను. నాకంటూ ఎవరూ లేరు. బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకుని ఆదరించాడు. మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిని నమ్మించి నన్ను మోసం చేశారు. రాము, రాధాకృష్ణ నాకు చాలా అన్యాయం చేశారు. ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు.
బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. నన్ను ప్రేమించే వారు తోడుగా లేక రోజూ టార్చర్ అనుభవించాను.

Silk Smitha: నా సొమ్ము తిని మోసం చేశారు…

ఈ బాధ భరించలేకపోతున్నాను… అంటూ సిల్క్ స్మిత ఆ లెటర్ లో రాసుకొచ్చారు. సిల్క్ స్మిత ఆత్మహత్య గురించి అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎవరిని దోషులుగా తేల్చలేదు. కొన్ని వందల సినిమాలలో నటించిన సిల్క్ స్మిత మరణం తర్వాత ఎవరూ కూడా ఆమె పార్తివదేహాన్ని చూడటానికి రాలేదు. ఒక అనాథల మట్టిలో కలిసిపోయింది. ఆమె భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా ఆమె నటించిన సినిమాల ద్వారా ఇప్పటికీ అందరి మనసుల్లో జీవించే ఉంది.

Silk Smitha: సిల్క్ స్మిత మరణం వెనుక కారణం ఆయనకే తెలియాలి… కాకినాడ శ్యామల కామెంట్స్ వైరల్!

Silk Smitha: సిల్క్ స్మిత ఒకానొక సమయంలో ప్రత్యేక పాటల ద్వారా తన అంద చందాలతో మత్తు కళ్ళతో అద్భుతమైన డ్యాన్సులతో కుర్రకారులను సందడి చేసిన సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇలా ఇండస్ట్రీలో పలు భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ స్మిత అర్ధాంతరంగా మృతి చెందారు.

ఇలా సిల్క్ స్మిత మరణించడానికి సరైన కారణం ఏంటి అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.కొందరు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈమె చనిపోయింది అంటూ కామెంట్లు చేయడం మరికొందరు సిల్క్ స్మిత మరణం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి అంటూ ఈమె మరణం పై స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నటి కాకినాడ శ్యామల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ సిల్క్ స్మిత మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాకినాడ శ్యామల మాట్లాడుతూ తను ఫైనాన్షియర్ గా ఉన్న సమయంలో సిల్క్ స్మిత తన వద్ద డబ్బు తీసుకొని సినిమా చేసిందని తెలిపారు. అయితే ఆ సినిమా పూర్తిగా డిజాస్టర్ కావడంతో ఆమె చాలా నష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. అయితే తిరిగి తన కోలుకొని తన డబ్బు మొత్తం తనకు చెల్లించిందని కాకినాడ శ్యామల వెల్లడించారు. ఇలా ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న సమయంలో సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

Silk Smitha: భగవంతుడికే తెలియాలి…


ఇక సిల్క్ స్మిత ది ఆత్మహత్యనా లేక హత్యన అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటి ఆమె మరణం ఎలా సంభవించింది అనే విషయాలన్ని ఆ భగవంతునికే తెలియాలి అంటూ ఈ సందర్భంగా సిల్క్ స్మిత మరణం గురించి కాకినాడ శ్యామల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Silk Smitha : నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే తను డ్యాన్స్ చేయనంది.. తీసుకున్న చెక్ కూడా వాపస్ ఇచ్చింది.. అంతే ఆర్థికంగా దిగజారిపోయింది. : శివశంకర్ మాస్టర్.

Silk Smitha : సిల్క్ స్మిత‌ ఎన్నో సంవత్స‌రాల పాటు ఈమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఐట‌మ్ భామ‌గా, న‌టిగా మెరిసింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఈమె బ‌యోపిక్‌ను వెండితెర‌పై తీశారు కూడా. అయితే ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన అమ్మాయి సిల్క్ స్మిత‌గా ఎలా స్టార్ అయింది.. అస‌లు ఆమె సినిమా ప్ర‌వేశం ఎలా జ‌రిగింది.. త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ స్మిత అస‌లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి రాములు, తండ్రి నర్సమ్మ. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ వల్ల విజయలక్ష్మిని 5వ తరగతిలోనే చదువు మానిపించారు.

14 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ భర్త, అత్తమామలు ఆమెను ఎప్పుడూ హింసించేవారు. తన కష్టాలను మేనత్తకు చెప్పుకోగా.. ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త. అక్కడ తనకు తెలిసిన‌ వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో జూనియర్ ఆర్టిస్టులకు మేకప్‌ చేసుకుంటూ గడిపేది. కానీ ఒక‌రోజు నిర్మాత విను చక్రవర్తి భార్య షూటింగ్ జరిగే దగ్గర సిల్క్ స్మిత‌ను చూసి ఈమె నటి అయితే బాగుంటుంది అని ఆమెను అడిగారు. ఆమె కూడా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమ వ‌ద్ద పెట్టుకుని నటన, డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత స్మిత అని పేరు మార్చి సినిమాలో అవకాశం ఇచ్చారు.
అయితే చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు ఆ పేరు వచ్చి.. అది అలానే కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు. ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలాగే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నటిగా పేరు బాగా సంపాదించిన‌ సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది.. అయితే శివ శంకర్ మాస్టర్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1985లో వచ్చిన “భలే తమ్ముడు” చిత్రానికి గాను తనను దర్శకులు పరుచూరి బ్రదర్స్ కొరియోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణతో ఐటమ్ సాంగ్ కి సిల్క్ స్మితను అనుకొని చెక్ అడ్వాన్స్ గా ఇచ్చారు. నేను ఆ పాటకు నృత్య దర్శకునిగా చేస్తున్నానని తెలుసుకున్న సిల్క్ స్మిత వేరొక వ్యక్తితో నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేయనని చెప్పారని అతను చెప్పారు. నేను ఒక్కసారి అవాక్కయ్యాను. ఆ విషయం తెలుసుకొని ఆ సినిమా నుంచి పక్కకు వైదొలుగుదాం అనుకున్నాను.

కానీ దర్శక నిర్మాతలు నేను కొరియోగ్రాఫర్ గా ఉండాలని అవసరమైతే సిల్క్ స్మిత ప్లేస్ లో మరొకరిని ఐటమ్ గర్ల్ గా తీసుకుంటామని చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న సిల్క్ స్మిత తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన చెక్కును రిటర్న్ చేశారు. అలాగే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది. అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. అలా ఆమె అర్థాంత‌రంగా త‌నువు చాలించిందన్నారు. ఆమె మంచి బ్యూటిఫుల్ డాన్సర్ అని, ఆమె చీర కడితే ఎంతో అందంగా ఉంటారని ఆ ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా చాన్సుల కోసం ఇంటి నుంచి మద్రాసు వెళ్లిన సిల్క్ స్మిత !

సినిమాలలో నటించాలనే తపన ఆశ ఎంతోమందిని ఇండస్ట్రీ వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే చాలామంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్క్ స్మిత ఎన్నో సినిమాలలో వ్యాంప్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో నటిస్తూ ఎంతో మందిని ఆకర్షించింది.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈమె తనకు నటన పై ఉన్న ఆసక్తి తనని ఇండస్ట్రీ వైపు నడిచేలా చేసింది. నిజానికి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, నరసమ్మ. వీరు ఏలూరు దగ్గర ఓ గ్రామంలో నివసించే వారు.అయితే సిల్క్ స్మిత సమీప బంధువు అన్నపూర్ణమ్మ అనే మహిళకు పిల్లలు లేకపోవడంతో విజయలక్ష్మిని దత్తత తీసుకుంది.

స్కూల్ కి వెళ్తున్న సమయంలో విజయలక్ష్మిని చూసి అన్నపూర్ణమ్మ తను సినిమాల్లో నటిస్తే ఎంతో మంచి పేరు సంపాదించుకుంటుంది. ఆమె మత్తుగా కళ్ళు అందరిని ఆకర్షిస్తాయి, ఎలాగైనా తనని సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకువెళ్లాలని భావించింది. ఈ క్రమంలోనే విజయలక్ష్మి కూడా తనకు సినిమాల్లో నటించాలని ఉందని చెప్పడంతో తనకు మార్గం సులభం అయింది.

అలా విజయలక్ష్మి తన తల్లిదండ్రులకు చెప్పకుండా తన పెంపుడు తల్లితో కలిసి మద్రాస్ బయలుదేరారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సిల్క్ స్మితను తమిళ దర్శకుడు విను చక్రవర్తి చూసి ఈమెకు భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది అంటూ చక్రవర్తి తన భార్య కూడా ఆర్టిస్ట్ కావడంతో ఆమెకు కొన్ని మెలకువలు నేర్పించారు.

ఈ క్రమంలోనే విను చక్రవర్తి దంపతుల సహకారంతో సిల్క్ స్మిత 1979లో ‘ఇనయేటేడి’ అనే మలయాళ చిత్రంలో క్యాబరే డాన్సర్ కేరక్టర్ చేసింది. ఈ సినిమా తన జీవితాన్ని మార్చి వేసిందని చెప్పవచ్చు.ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలను సంపాదించుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత కొన్ని కారణాల వల్ల 1996 మద్రాసులోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.