Silk Smitha: గ్లామర్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి తెలియని వారంటూ ఉండరు. బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఆ రోజుల్లో యువకుల గుండెల్లో మంటలు రేపింది. ఈమె తన అందాలతో , మత్తెక్కించే కళ్లతోనే అందరినీ మాయ చేస్తూ హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయం భాషలలో ఎందరో స్టార్ హీరోలతో జత కట్టింది.
స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు అంటే ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎమిటో మనకి అర్థమవుతుంది. ఏ హీరో సినిమా అయినా సరే సిల్క్ స్మిత పాట తప్పకుండా ఉండాలి . ఆమె పాట ఉంటేనే సినిమా హిట్టు అవుతుందని అనే నమ్మకం ఏర్పడింది. స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువ స్టార్‌డం సంపాదించుకుంది. ఇలా ఇండస్ట్రీలో తన అందాలతో ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.
ఇప్పటికీ ఆమె లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. అయితే సిల్క్ స్మిత లేని లోటు పూర్తి చేయడానికి మళ్లీ ఇన్నేళ్లకు సిల్క్ స్మితే జనాల ముందుకు వచ్చేసింది. అచ్చం సిల్క్ స్మితని పోలిన అందంతో జూనియర్ సిల్క్ స్మిత అందరిని అలరిస్తోంది.ఈమెను చూస్తే నిజంగా సిల్క్ స్మితనే మళ్ళీ పుట్టిందా అనిపిస్తుంది . అదేలా సాధ్యం అంటే.. ఇదుగో ఇలా అంటుంది జూనియర్ సిల్క్ స్మిత అలియాస్ విష్ణు ప్రియ. ఫేస్‌కట్, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిల్క్ స్మితను గుర్తు చేస్తోన్న విష్ణు ప్రియ అనే యువతీ టిక్ టాక్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.
తిరుపతికి చెందిన విష్ణు ప్రియ అచ్చం సిల్క్ స్మిత లాగా ఉండటంతో టిక్ టాక్ వీడియోస్ లో బాగా ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడికి తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తెలుగులో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ సిల్క్ స్మిత తాను అలా ఉండటానికి గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక ఈమెను చూసిన అభిమానులు సిల్క్ స్మిత బ్రతికే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…