Jordar Sujatha : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక జోర్ధార్ వార్తలు చదువుతూ ఫేమస్ అయిన సుజాత రాకేష్ సుజాత ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయి ఆ తరువాత ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి పలు షోలలో సందడి చేస్తున్న వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా సుజాత నటించిన ‘సేవ్ ది టైగర్’ సిరీస్ తో అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ, కెరీర్ గురించి పంచుకుంది.
పెళ్లి చేసుకో అని నేనే చాలా సార్లు చెప్పా…
సుజాత, రాకేష్ ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్లిదరి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ అసలు ఎవరు ప్రపోజ్ చేసుకున్నామో తెలియదు, ఇద్దరం మొదటి నుండి మంచి స్నేహితులం అంటూ సుజాత తెలిపింది. రాకేష్ కి పెళ్లి మీద ఇంట్రస్ట్ లేకపోతే ఎన్నో సార్లు ఒక స్నేహితురాలిగా పెళ్లి చేసుకో ఒంటరిగా ఉండలేవు ఒక ఏజ్ వచ్చాక అంటూ సలహా ఇచ్చారట సుజాత.
ఇక వాళ్లిద్దరి లవ్ స్టోరీ ఇంత త్వరగా ముందుకు సాగడానికి పెళ్లి త్వరగా అయిపోడానికి కారణం రోజా గారు అంటూ తెలిపారు. ఆమె మొదట కనిపెట్టేసారు రాకేష్ నేను ప్రేమించుకుంటున్నాం అని అంటూ చెప్పారు. ఇక ప్రేమించుకునే సమయంలో మాకు దగ్గరగా ఉన్న వాళ్ళే మా మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించారంటూ తెలిపారు. నెగిటివ్ గా తన గురించి చెప్పడం లాంటివి చేసారు అంటూ ఎమోషనల్ అయ్యారు సుజాత. ఇక తాను నా లైఫ్ లో లక్కీ పర్సన్ అని తాను లైఫ్ లోకి వచ్చినప్పటి నుండి నాకు లక్ మొదలయిందంటూ సుజాత తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…