Featured

Analyst Damu Balaji : సిబిఐకి లొంగిపోమని ఎర్ర గంగిరెడ్డికి సలహా ఇచ్చింది ఎవరు… ఎర్ర గంగిరెడ్డికి లాయర్ చెప్పిందేమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా వివేకానంద హత్య కేసులో ఏ2 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి పరారీ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించగా తాజాగా ఆయన రేపు నాంపల్లి కోర్ట్ లో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. అసలు బెయిల్ గడువు ముగిసి పరారిలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ కి లొంగిపోడానికి కారణం ఏమిటి, ఎవరు చెబితే లొంగిపోతున్నాడు వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

లాయర్ సలహాతో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి…

వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం కీలకంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అందులో భాగంగానే దస్తగిరి చెప్పిన వారిలో ఎర్ర గంగిరెడ్డి ఉండటం వలన అతడిని సిబిఐ అరెస్టు చేయగా బెయిల్ మీద బయట ఉండగా తాజాగా బెయిల్ గడువు ముగిసింది. ఇక అజ్ఞాతంలో ఉంటూ ఉన్న ఎర్ర గంగిరెడ్డి కోర్ట్ లో లొంగిపోమన్ని ఆయన లాయర్ సలహా ఇచ్చారట. లొంగిపోకుండా ఉంటే సిబిఐ మరో కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంది.

అనవసరమైన సమస్యలు తెచ్చుకోవడం కంటే లొంగిపోవడం ఉత్తమం అని, ఒకవేళ కోర్ట్ లో ట్రైయిల్ జరగక పోతే బెయిల్ మళ్ళి వస్తుంది అని కన్విన్స్ చేసి లొంగిపోయేలా చేశారట. నాంపల్లి కోర్ట్ లో త్వరలో హాజరువ్వబోతున్నారు. అయితే మొదటి నుండి కేసులో దస్తగిరి చెబుతున్న కథనే సిబిఐ కూడా ఫాలో అవుతోందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. లేదంటే సిబిఐ దస్తగిరిని వాడుకుంటూ ఈ కథ అల్లి అది ప్రచారం చేయమని చెప్పుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

1 month ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

1 month ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago