Tag Archives: singer mano

Singer Mano: సింగర్ మనో జబర్దస్త్ వీడటానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన మనో!

Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.

ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.

ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.

Singer Mano: జబర్దస్త్ కు చిన్న బ్రేక్ ఇచ్చాను..


ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వాళ్లు ‘సింగర్ మనో’ను బెదిరించి.. కాళ్లు పట్టించుకున్నారు.. ఎందుకో తెలుసా..

గాయకుడు, నటుడు మనో (నాగూర్ బాబు) ప్రస్తుతం జబర్దస్త్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే అతడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతడు చిన్న తనంలోనే నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే ‘నీడ’ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు.

ఇళయరాజా ఆయన పేరును నాగూర్ బాబు నుంచి మనోగా మార్చాడు. ఇదిలా ఉండగా.. అతడు ఈ టీవీలో ప్రసారం అవుతున్న అలీతో సరదాగా ప్రోగ్రాంలో ఆసక్తికర విషయాలను చెప్పాడు. మద్రాస్ లో అతడు సంగీతానికి సంబంధించిన వోకల్ విద్యను (స్వరం రాసే) నేర్చుకోవడానికి ఎంఎస్ విశ్వనాథం దగ్గర అతడు 14 వ ఏట అసిస్టెంట్ గా వెళ్లినట్లు తెలిపాడు.

అప్పటికే అతడి వద్ద బులేబకావలి కథకు సంగీత దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణమూర్తి మరియు సింగర్ కల్పన తండ్రి రాఘవేందర్ కూడా అతడి వద్ద అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. అక్కడ రెండు నుంచి మూడు నెలలు అతడి వద్ద స్వరం రాయడం నేర్చుకున్నట్లు తెలిపాడు. తర్వాత మనో రాసిన దానిని చూసి ఎంఎస్ విశ్వనాథం ఎంతో సంతోష పడ్డట్లు తెలిపాడు. అతడు స్వరం రాయమని చెప్పగానే త్వరగా రసేవాడట. అయితే అక్కడ తన ఎదుగుదలను చూసి అతడి వద్ద పనిచేసే ఆ ఇద్దరు అసిస్టెంట్లకు నచ్చలేదని.. ఇంకో సారి స్వరం రాస్తే.. మద్రాస్ లో కూడా కనిపించవని విజయ్ కృష్ణమూర్తి బెదిరించినట్లు పేర్కొన్నారు.

కారణం ఎంటంటే.. వాళ్లకు వయస్సు అయిపోయింది.. మనో చిన్నపిళ్లవాడు ఇలానే చెప్పింది చెప్పినట్లు రాస్తూ ఉంటే.. తమకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో వాళ్లు ఈ మాట అన్నట్లు తెలిపాడు. తర్వాత కూడా విశ్వనాథంకు ఈ విషయం అర్థం అయింది కానీ వాళ్లను ఏమనలేదు అని చెప్పుకొచ్చాడు. అలా అతడి వద్ద అన్నీ నేర్చుకుంటూనే.. అక్కడ ప్రతీ ఒక్కరి కాళ్లు పట్టి.. టీలు తెచ్చేవాడట. ఇలా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ రెండు సంవత్సరాలు అతడి వద్ద ఎన్నో మెళకువలు నేర్చుకున్నట్లు చెప్పాడు మనో.