Tag Archives: sirisha

Barrelakka: పెళ్లి పీటలు ఎక్కబోతున్న బర్రెలక్క.. వరుడు ఎవరో తెలుసా?

Barrelakka: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలుగా మారిపోయారు ఇలా సెలబ్రిటీలకు గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష ఒకరు. ఈమె డిగ్రీ పూర్తి చేసిన తనకు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు రాకపోవడంతో బర్రెలు కాసుకుంటూ ఉన్నాను అంటూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అప్పటినుంచి ఈమె ఎంతో పాపులర్ అయ్యారు.

ఇలా తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల అలాగే యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి బర్రెలక్క గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో దిగి ఎన్నికలలో నిలిచారు.

ఇలా ఎన్నికలలో నిలబడటంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈమె పేరు భారీ స్థాయిలో మారుమోగిపోయింది. ఇక ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో తిరిగి వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఈమె తనకు పెళ్లి కుదిరింది అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

సడన్ గా నిశ్చితార్థం..
అనుకోకుండా తనకు నిశ్చితార్థం జరిగిపోయిందని అందుకే ఎవరిని తాను నిశ్చితార్థానికి పిలవలేకపోయానని తన నిశ్చితార్థపు వీడియోతో పాటు పెళ్లి కోసం షాపింగ్ చేస్తున్నటువంటి వీడియోలను కూడా ఈమె అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఏం చేస్తుంటారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

https://www.instagram.com/reel/C4rmM8XpF1i/?utm_source=ig_embed&ig_rid=10d1b656-eeb0-4756-946e-ca206366ee29

Barrelakka: స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బర్రెలక్క.. ఎవరీ బర్రెలక్క… ఆమె ఎన్నికల మేనిఫెస్టో ఏంటి?

Barrelakka: మరొక వారం రోజులలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే పలు ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికలలో పోటీ చేస్తూ ఉండటం సర్వసాధారణం ఇలా ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఎంతో మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసి గెలుపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు ఎవరు మనకు పెద్దగా గుర్తుండరు కానీ ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి బర్రెలక్క మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా బర్రెలక్కగా గుర్తింపు పొందిన శిరీష ఎన్నికలలో పోటీ చేయబోతున్నారనే విషయం తెలియడంతో ఈమెకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయబోతున్నటువంటి ఈ బర్రెలక్క ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం. శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. చదువుకుంటూనే కుటుంబ పోషణ చూసుకుంటూ వస్తున్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఈమె బీకాం పూర్తి చేశారు.

ఇలా డిగ్రీ పూర్తి చేసిన శిరీషకు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే నోటిఫికేషన్లు రాకపోవడం వచ్చిన కోర్టులో పెండింగ్ పడటంతో తాను ఉద్యోగం పై ఆశలు కూడా వదులుకున్నారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె ఒక వీడియో చేశారు. హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో డిగ్రీలు చేసిన ఉద్యోగం రాకపోవడంతో మా అమ్మ నాకు ఈ బర్రెలు కొనిచ్చింది అందుకే బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియో చేశారు. ఇలా ఈ వీడియో ద్వారా శిరీష ఎంతో ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇంస్టాగ్రామ్ ద్వారా వివిధ రకాల వీడియోలు షేర్ చేసేవారు.

నిరుద్యోగుల కోసం పోరాటం…
ఇలా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా తాను గెలిస్తే కనుక అసెంబ్లీలోకి అడుగుపెట్టి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తానని సరైన సమయంలో ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వాటిని పూర్తిచేసేలా పోరాడుతానని తెలియజేశారు. అలాగే మండల స్థాయిలో ఇంటర్ డిగ్రీ కళాశాలలు ఉండేలా పోరాటం చేస్తానని పేదలకు ఉచిత విద్య వైద్యం కరెంట్ సదుపాయాలను తీసుకువస్తాను అంటూ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శిరీష పైనే అందరి చూపు ఉందని ఈమె తెలంగాణ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.