Tag Archives: skin care

చర్మ సౌందర్యానికి కాఫీ కూడా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా..?

ఏ కాలంలో అయినా బయట పనిచేసిన తర్వాత ముఖం అనేది జిడ్డుగా తయారు అవ్వడం అనేది సాధారణం. దీంతో వాటిపై మొటిమలు కూడా వస్తాయి. అయితే జిడ్డు చర్మాన్ని శుభ్రం చేసేందుకు ఎన్నో రకాల ఫేస్ వాష్ లు మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి ఇంట్లో తయరు చేసే రెమిడీస్ ఎక్కువ కాలం ఉపయోగకరంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.

మొదటిది రోజ్ వాటర్.. దీనిని చాలా వరకు చర్మ పరిష్కారానికి ఫేస్ వాష్ లో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ చేయడంతో ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మం తాజాగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నిమ్మ, తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

చర్మానికి మాయిశ్చరైజ్ చేయడంలో తేనె సహాయపడుతుంది. నిమ్మకాయ జిడ్డు చర్మానికి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత నీటితో మొహాన్ని కడగాలి. అప్పడు జిడ్డు అనేది కనిపించదు. ముఖంపై ఆయిల్ పడినా.. జిడ్డుగా కనిపిస్తుంటుంది.

దానిని తొలగించాలంటే.. కాఫీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఆయిల్ పడితే వెంటనే తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాఫీలోని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చర్మం పిహెచ్ బ్యాలెన్స్‌ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఒక టీస్పూన్ నీరు, టీస్పూన్ కాఫీ పౌడర్ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేయాలి. ఇలా ముఖానికి పట్టించి.. కొన్ని నిమిషాల తర్వాత తర్వాత కడిగితే.. జిడ్టు అనేది మటు మాయం అయిపోతుంది.

శీతాకాలంలో పొడిచర్మానికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?

శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. చర్మం పొడిగా మారడం వల్ల కొందరు దురదలతో బాధ పడుతూ ఉంటారు. చలికాలంలో చాలామందికి చర్మం తెల్లగా మారడం, చర్మంపై పగుళ్లు కనిపించడం జరుగుతుంది. శరీరంలో తేమ తక్కువైనా, చర్మ సంరక్షణ పద్ధతులు పాటించకపోయినా, అనువైన దుస్తులు ధరించకపోయినా పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చాలామంది చలికాలంలో ఎక్కువగా నీటిని తాగరు. తక్కువగా నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఖచ్చితంగా తగింత నీటిని తీసుకోవాలి. రిచ్ గా, ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ ను ఎంచుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో సాధారణంగా హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది.

హ్యుమిడిఫైయర్ ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల హ్యూమిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం ద్వారా పొడిచర్మం సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో గోరువెచ్చని నీటితో రోజూ స్నానం చేయడం ద్వారా పొడి చర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో కెమికల్స్ తో తయారైన సబ్బులను వినియోగించక పోవడమే మంచిది.

ప్రతిరోజూ దానిమ్మ పండు తినడం లేదా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత ఓమేగా 3 లభించి చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది.