ఏ కాలంలో అయినా బయట పనిచేసిన తర్వాత ముఖం అనేది జిడ్డుగా తయారు అవ్వడం అనేది సాధారణం. దీంతో వాటిపై మొటిమలు కూడా వస్తాయి. అయితే జిడ్డు చర్మాన్ని శుభ్రం చేసేందుకు ఎన్నో రకాల ఫేస్ వాష్ లు మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి ఇంట్లో తయరు చేసే రెమిడీస్ ఎక్కువ కాలం ఉపయోగకరంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
మొదటిది రోజ్ వాటర్.. దీనిని చాలా వరకు చర్మ పరిష్కారానికి ఫేస్ వాష్ లో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ చేయడంతో ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మం తాజాగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నిమ్మ, తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చర్మానికి మాయిశ్చరైజ్ చేయడంలో తేనె సహాయపడుతుంది. నిమ్మకాయ జిడ్డు చర్మానికి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసాన్ని, రెండు స్పూన్ల తేనెను తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత నీటితో మొహాన్ని కడగాలి. అప్పడు జిడ్డు అనేది కనిపించదు. ముఖంపై ఆయిల్ పడినా.. జిడ్డుగా కనిపిస్తుంటుంది.
దానిని తొలగించాలంటే.. కాఫీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఆయిల్ పడితే వెంటనే తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాఫీలోని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చర్మం పిహెచ్ బ్యాలెన్స్‌ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఒక టీస్పూన్ నీరు, టీస్పూన్ కాఫీ పౌడర్ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేయాలి. ఇలా ముఖానికి పట్టించి.. కొన్ని నిమిషాల తర్వాత తర్వాత కడిగితే.. జిడ్టు అనేది మటు మాయం అయిపోతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…