Tag Archives: sneham kosam

SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..

మెగాస్టార్ చిరంజీవి హీరో అంటే మాంచి మాస్ సాంగ్స్ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి చిరు సినిమాలకు మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. మెగాస్టార్ స్టెప్పులేయాలంటే అద్బుతమైన సంగీతం అందించే సంగీత దర్శకుడు కావాలి. దర్శకులు చిరు సినిమాలకు సంగీత దర్శకుడి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందుకు కారణం ఆయన డాన్సులకు ఉన్న ఫాలోయింగ్. చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు..మెగా అభిమానులతో పాటు అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని స్టార్స్ కూడా మెగాస్టార్ డాన్స్ అంటే విపరీతంగా ఆరాటపడతారు.

SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..

ఇక చిరుకి సినిమాలలో సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ షూటింగ్ చేయబోతున్నామంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సమయంలో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు 104 జ్వరం ఉండి కూడా సాంగ్ కంప్లీట్ చేశారంటే ఆయనకు డాన్స్ అంటే ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. కేవలం చిరు డాన్స్ చూసేందుకు థియేటర్స్‌కు వచ్చే ఆడియన్స్ ఓ వర్గమే ఉన్నారు. తెర మీద అన్నయ్య లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసినా..క్లాస్‌గా కాలు కదిపి చిన్న స్మైల్ ఇచ్చినా చాలు థియేటర్స్‌లో మోత మోగాల్సిందే.

SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..

ఇక ఏ కొదండరామి రెడ్డి లాంటి అగ్ర దర్శకుల దగ్గర్నుంచి ఇప్పుడున్న వి వి వినాయక్ లాంటి వారు ప్రస్తుతం మెగాస్టార్‌తో సినిమాలు చేస్తున్న యువ దర్శకుల వరకు అందరూ మెగాస్టార్ కోసం డాన్సుల విషయంలో కొత్తగా చూపించాలని తాపత్రయపడుతున్నారు. అప్పట్లో కోదండ రామిరెడ్డి – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వరుసగా 18 బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. చిరును హెవీ డాన్స్ మూవ్  మెంట్స్ లేకుండా సింపుల్‌గా చాలా స్టైలిష్ గా చూపించాలని సీనియర్ డాన్స్ మాస్టర్ సుందరం మాస్టార్‌తో చెప్పి మరీ కొత్తగా ట్రై చేశారు. కొండవీటి దొంగ సినిమాలోని సాంగ్స్ చూస్తే అందరికీ ఈ విషయం అర్థమౌతుంది.

SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..

ఇక సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు చిరు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్స్ కోసం ఎంతగా ఆలోచిస్తారో, ఆ సాంగ్ విని ఎలాంటి స్టెప్పులు అన్నయ్యతో వేయిస్తే థియేటర్స్ రీ సౌండ్‌తో అదిరిపోతాయో ఆలోచిస్తారు. కొందరు సంగీత దర్శకులంటే ఇక ఆడియన్స్ గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు దేవీశ్రీప్రసాద్, మణిశర్మ మెగాస్టార్ కోసం ఎలాంటి ఆల్బంస్ ఇచ్చారో తెలిసిందే. అయితే మంచి సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ ఆల్బంస్ ఇచ్చి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడానికి కారణం అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఏ రాజ్ కుమార్ కూడా మెగాస్టార్ సినిమాలకు సంగీతం అందించారు.

SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..

కానీ, ఈ విషయం చాలామంది నమ్మలేదు. అందుకు కారణం అప్పుడు దాదాపు మెగాస్టార్ అన్నీ సినిమాలకు సంగీతం అందిస్తూ వచ్చింది మణిశర్మే. అలాంటి స్నేహం కోసం, డాడీ సినిమాలకు సంగీత దర్శకుడు ఎస్ ఏ రాజ్ కుమార్ అనగానే కొంత టెన్షన్ పడ్డ అభిమానులు ఉన్నారు. అన్నయ్య కోసం ఎలాంటి సాంగ్స్ ఇస్తారు అని. కానీ డాడీ సినిమాలో సాంగ్స్ పెద్ద హిట్. అలాగే స్నేహం కోసం సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో రిలీజై సూపర్ హిట్ అయ్యాక గానీ అభిమానులు చిరు సినిమాకు ఎస్ ఏ రాజ్ కుమార్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని నమ్మలేకపోయాయి. ఇక ఈ మ్యూజిక్ డైరెక్టర్ వసంతం, సూర్యవంశం, శుభాకాంక్షలు, సింహరాశి, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, శివ రామరాజు, కలిసుందాం రా, రాజా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చారు.

‘స్నేహం కోసం’ సినిమాలో ఆ పాత్రకు సూపర్‌‌‌స్టార్ కృష్ణ, తర్వాత రాజశేఖర్ ను అనుకున్నారట.. కానీ చివరకు..

ఒకప్పుడు తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం మెగస్టార్ చిరంజీవిని బాగా ఆకట్టుకుంది. తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు. దానిని 1999లో అతడి దర్శకత్వంలోనే ‘స్నేహం కోసం’ అనే తెలుగు టైటిల్ తో విడుదల అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిరంజీవికి ఆప్తమిత్రుడిగా ప్రముఖ నటుడు విజయకుమార్ నటించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే అందులో చిరంజీవి స్నేహితుడిగా విజయ కుమార్ చేసిన పాత్రకి ముందుగా సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారట.

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహంకోసం సినిమా షూటింగ్‌‌కి ముందు వీరిద్దరూ ఇందులో కలిసి నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవి కేవలం వార్తలుగానే మిగిలిపోయాయి. ఎందుకుంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అందుకనే అలా ఆలోచించారట. ఇదంతా అనుకుంటుడగానే.. చిరంజీవి ఎందుకో సూపర్ స్టార్ ను సంప్రదించలేదట. తర్వాత ఆ పాత్రను రాజశేఖర్ ను అనుకొని అతడిని సంప్రదించారు మూవీ మేకర్స్.

ఇక రాజశేఖర్ ఆ పాత్రకు ఓకె అయిన సమయంలో చిరంజీవి వెళ్లి.. ఆ పాత్ర చేయకపోవడమే మంచిది.. ఈ సమయంలో ఓల్డ్ రోల్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో విరమించుకోవాల్సి వచ్చిందట. చివరకు ఆ పాత్రకు తమిళంలో నటించిన విజయ్ కుమారే చేయాల్సి వచ్చిందట.