SA Rajkumar : సూపర్ హిట్ చిత్రాలకు సక్సెస్‌ఫుల్ ఆల్బంస్ ఇచ్చిన ఎస్ ఏ రాజ్ కుమార్ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరూ నమ్మలేదు..
మెగాస్టార్ చిరంజీవి హీరో అంటే మాంచి మాస్ సాంగ్స్ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచి చిరు సినిమాలకు మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. మెగాస్టార్ స్టెప్పులేయాలంటే అద్బుతమైన సంగీతం అందించే సంగీత దర్శకుడు కావాలి. దర్శకులు చిరు సినిమాలకు సంగీత దర్శకుడి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందుకు కారణం ఆయన డాన్సులకు ఉన్న ఫాలోయింగ్. చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు..మెగా అభిమానులతో పాటు అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని స్టార్స్ కూడా మెగాస్టార్ డాన్స్ అంటే విపరీతంగా ఆరాటపడతారు.
ఇక చిరుకి సినిమాలలో సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ షూటింగ్ చేయబోతున్నామంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సమయంలో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు 104 జ్వరం ఉండి కూడా సాంగ్ కంప్లీట్ చేశారంటే ఆయనకు డాన్స్ అంటే ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. కేవలం చిరు డాన్స్ చూసేందుకు థియేటర్స్‌కు వచ్చే ఆడియన్స్ ఓ వర్గమే ఉన్నారు. తెర మీద అన్నయ్య లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసినా..క్లాస్‌గా కాలు కదిపి చిన్న స్మైల్ ఇచ్చినా చాలు థియేటర్స్‌లో మోత మోగాల్సిందే.
ఇక ఏ కొదండరామి రెడ్డి లాంటి అగ్ర దర్శకుల దగ్గర్నుంచి ఇప్పుడున్న వి వి వినాయక్ లాంటి వారు ప్రస్తుతం మెగాస్టార్‌తో సినిమాలు చేస్తున్న యువ దర్శకుల వరకు అందరూ మెగాస్టార్ కోసం డాన్సుల విషయంలో కొత్తగా చూపించాలని తాపత్రయపడుతున్నారు. అప్పట్లో కోదండ రామిరెడ్డి – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వరుసగా 18 బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. చిరును హెవీ డాన్స్ మూవ్ మెంట్స్ లేకుండా సింపుల్‌గా చాలా స్టైలిష్ గా చూపించాలని సీనియర్ డాన్స్ మాస్టర్ సుందరం మాస్టార్‌తో చెప్పి మరీ కొత్తగా ట్రై చేశారు. కొండవీటి దొంగ సినిమాలోని సాంగ్స్ చూస్తే అందరికీ ఈ విషయం అర్థమౌతుంది.
ఇక సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు చిరు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్స్ కోసం ఎంతగా ఆలోచిస్తారో, ఆ సాంగ్ విని ఎలాంటి స్టెప్పులు అన్నయ్యతో వేయిస్తే థియేటర్స్ రీ సౌండ్‌తో అదిరిపోతాయో ఆలోచిస్తారు. కొందరు సంగీత దర్శకులంటే ఇక ఆడియన్స్ గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు దేవీశ్రీప్రసాద్, మణిశర్మ మెగాస్టార్ కోసం ఎలాంటి ఆల్బంస్ ఇచ్చారో తెలిసిందే. అయితే మంచి సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ ఆల్బంస్ ఇచ్చి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడానికి కారణం అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఏ రాజ్ కుమార్ కూడా మెగాస్టార్ సినిమాలకు సంగీతం అందించారు.
కానీ, ఈ విషయం చాలామంది నమ్మలేదు. అందుకు కారణం అప్పుడు దాదాపు మెగాస్టార్ అన్నీ సినిమాలకు సంగీతం అందిస్తూ వచ్చింది మణిశర్మే. అలాంటి స్నేహం కోసం, డాడీ సినిమాలకు సంగీత దర్శకుడు ఎస్ ఏ రాజ్ కుమార్ అనగానే కొంత టెన్షన్ పడ్డ అభిమానులు ఉన్నారు. అన్నయ్య కోసం ఎలాంటి సాంగ్స్ ఇస్తారు అని. కానీ డాడీ సినిమాలో సాంగ్స్ పెద్ద హిట్. అలాగే స్నేహం కోసం సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో రిలీజై సూపర్ హిట్ అయ్యాక గానీ అభిమానులు చిరు సినిమాకు ఎస్ ఏ రాజ్ కుమార్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని నమ్మలేకపోయాయి. ఇక ఈ మ్యూజిక్ డైరెక్టర్ వసంతం, సూర్యవంశం, శుభాకాంక్షలు, సింహరాశి, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, శివ రామరాజు, కలిసుందాం రా, రాజా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…