మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పుడు జోరు పెంచారు. వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు. 60 ఏళ్ళు దాటిన ఈ హీరోలు ఇప్పుడు యంగ్ హీరోలతో గట్టిగా పోటీపడుతున్నారు. చెప్పాలంటే వారికంటే కూడా దూకుడుగా సినిమాలని కమిటవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలలో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ నారప్ప, దృశ్యం 2 చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇటీవల నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో వచ్చి భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఆయన 100వ సినిమా తర్వాత వచ్చిన పెద్ద సక్సెస్ ఇది. బోయపాటి ఎట్టకేలకు బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు. ఇక నాగార్జున న్యూ ఇయర్లో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు సినిమాతో రాబోతున్నాడు. ఆయన కొడుకు నాగ చైతన్యతో కలిసి నాగార్జున నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినియర్ హీరోలు సీనియర్ దర్శకులను దాదాపుగా పక్కన పెట్టేశారు. బి.గోపాల్, వి వి వినాయక్ లాంటి యాక్షన్ చిత్రాలను తీసి భారీ హిట్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు కనిపించడం లేదు. పూరి జగన్నాథ్ లాంటి వారు ఎటూ వీరి కోసం ఎదురుచూడరు కాబట్టి అలాంటి దర్శకుల గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ సమయానికి పూరికి ఏ హీరో దొరికితే ఆ హీరోతో మూవ్ అవుతాడు. అయితే ఎందుకు సీనియర్ హీరోలు సీనియర్ దర్శకులతో సినిమా చేసేందుకు ఆలోచిస్తున్నారు అంటే వినిపిస్తున్న సమాధానం ఒకటే.
వారు కొత్తగా ఆలోచిచలేకపోతున్నారనే మాట. మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్స్ చూస్తే క్లియర్‌గా ఈ విషయం అర్థమవుతుంది. అందరూ యువ దర్శకులకే చిరు ఛాన్స్ ఇచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ కి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ సినిమా, మెహర్ రమేశ్‌తో భోళా శంకర్, బాబీతో వాల్తేర్ వీరయ్య, కొరటాల శివతో ఆచార్య, ఇటీవల వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు. వీరంతా మెగాస్టార్ వీరాభిమానులు. కాబట్టి కొత్తగా చూపించడానికి కసితో సినిమా తీస్తారు.
ఇక బాలయ్య కూడా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బి గోపాల్ లాంటి సీనియర్ దర్శకుడితో ప్రాజెక్ట్ సెట్ అవడం ఇప్పుడు కష్టమే అంటున్నారు. నాగార్జున కూడా కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన వైల్డ్ డాగ్ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. వెంకీ కూడా శ్రీకాంత్ అడ్డాల, జీతూ జోసెఫ్ లాంటి యంగ్ డైరెక్టర్‌తో సినిమాలు చేశాడు. నెక్స్ట్ సినిమాలను యంగ్ డైరెక్టర్స్‌తో చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మన సీనియర్ హీరోలు మరింతమంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారని అర్థమవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…