RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత..?
RRR Movie: ఇండియన్ ఫిలీం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. బాహుబలి1, 2 హిట్ల తరువాత రాజమౌళి సినిమా కావడంతో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్లుగానే సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ట్రిపుల్ ఆర్ రూపొందుతోంది. దాదాపు రూ. 450 కోట్ల వరకు సినిమాకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈసినిమాకు అసలు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం ప్రస్తుతం జనాలను ఆకర్షిస్తోంది. ఇందులో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్లకు కూడా భారీస్థాయిలో పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపుగా రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ ట్రిపుల్ ఆర్ సినిమా తీశారు. ముఖ్యంగా రామ్ చరన్, ఎన్టీఆర్ లు ఈ సినిమాకు చెరో రూ. 45 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డెరెక్టర్ రాజమౌళి పారితోషకంపై ఎక్కువ ఆసక్తి క్రియేట్ అవుతోంది. అందరి కన్నా ఎక్కువగా రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. కాగా నిర్మాతలు రాజమౌళికి ఎంతైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రాజమౌళి సినిమా బిజినెస్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
దాదాపు సినిమా లాభాల వాటాలో 30 శాతం వరకు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు సినిమాలో కీలక పాత్ర పోషించిన అజయ్ దేవ్ గన్ కు రూ. 25 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ కు రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే స్టార్స్ రెమ్యునరేషన్, టెక్నీషియన్ రెమ్యునరేషన్ కే దాదాపుగా రూ. 200 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. సినిమా ప్రొడక్షన్ కోసం రూ. 230 కోట్లు, సినిమా ప్రమోషన్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…