Movie Tickets: ఆ రోజు పవర్ స్టార్ కు సపోర్డు చేసి ఉంటే..ఈ రోజు అలా అయ్యేది కాదు కదా..!
Movie Tickets: టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం.. టాలీవుడ్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. విమర్శలు, కౌంటర్లతో ఇటు సినిమా యాక్టర్లు, అటు ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ థియేటర్లో సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గించడంతో వివాదం ఏర్పడింది.
అయితే గతంలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు మద్దుతు ఇచ్చి ఉంటే మరింతగా నిలిస్తే బాగుండేది కదా.. అనే వాదనలు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ ’రిపబ్లిక్‘ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాణ్ వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తనను దెబ్బ కొట్టేందుకు సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నారని… జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
నా మీద కోపంతో సిని ఇండస్ట్రీని దెబ్బతీయద్దని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలకు ధీటుగానే ఏపీ మంత్రి నాని కూడా పవన్ కళ్యాన్ పై విరుచుకు పడ్డారు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి పవన్ కు అనుకున్నంతగా మద్దతు లభించలేదు. కేవలం నితిన్, కార్తికేయ వంటి హీరోలు ఏదో స్పందించారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరుగా ఉన్న దిల్ రాజు ప్రభుత్వంతో చర్చించి ఆ వివాదం అక్కడికే సద్దుమనిగేలా చేశారు.
తాజాగా నాని వైసీపీ సర్కార్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఏపీలో సినిమా థియేటర్ల కలెక్షన్లు.. కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగానే ఉన్నాయంటూ విమర్శించారు. తాజాగా ఈవ్యాఖ్యలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో పవన్ కళ్యాన్ కు మద్దతు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ, ఓవర్సీస్ లో కలెక్షన్లు బాగున్నా.. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో కలెక్షన్లు లేకపోవడంతో ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు ఆధారపడేలా అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…