nasuya: యాంకర్ నుంచి స్టార్ గా ఎదుగుతోంది అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా చేసిన క్యారెక్టర్ అనసూయకు పేరు తెచ్చి పెట్టింది.
Anasuya: యాంకర్ నుంచి స్టార్ గా ఎదుగుతోంది అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా చేసిన క్యారెక్టర్ అనసూయకు పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం పుష్ప సినిమాలో చేనిన ద్రాక్షాయణి క్యారెక్టర్ కూడా అంతే స్థాయిలో గుర్తింపు తెచ్చింది. జబర్థస్త్ యాంకర్ గా తన అందాలతో, గ్లామర్ తో కట్టిపడేసిన అనసూయ.. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై తన యాక్టింగ్ టాలెంట్ ను చూపిస్తోంది.
అయితే ఇటీవల ఇన్ స్టాలోకి వచ్చిన అనసూయ.. తనపై యూట్యూబ్ లో వస్తున్న థంబ్ నెల్స్ పై ఫైర్ అయింది. గతంలో కూడా తన డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్ చేస్తే ఘాటుగానే స్పందించింది అనసూయ. తన డ్రెస్సింగ్ తన ఇష్టం..అని తనకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అదే వేసుకుంటానని ఘాటుగానే నెటిజెన్లకు వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా అనసూయపై యూట్యూబ్ లో అసభ్యమైన థంబ్ నెల్స్ పెడుతున్నారంటూ వాపోయింది.
ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అంటూ పెడుతుంటారు అని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని అనుకుంటాను కానీ… కొన్ని సార్లు మనల్ని కించపరిచేలా ఉండటంతో స్పందించాల్సి వస్తుందని అనసూయ అన్నారు.
నేను బరువు పెరగడం తగ్గడం నాఇష్టమని చెప్పింది అనసూయ. అయితే మీ దిగజారుడు తనాన్ని ఎలా సమర్థించుకుంటారని స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది అనసూయ. నేను కూడా మీకు లాగే కామెంట్స్ చేయగలను.. నేను మిమ్మల్ని హర్ట్ చేయగనని కానీ నా వ్యక్తిత్వం అలాంటి కాదని అన్నారు ఆమె. మరోసారి తన స్ట్రాంగ్ రిప్లేతో నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు అనసూయ.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…