Tag Archives: software engineer

Sharwanand -Rakshitha Reddy: శర్వానంద్ కాబోయే భార్య రక్షిత రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Sharwanand -Rakshitha Reddy: టాలీవుడ్ హీరో శర్వానంద్ ఘనంగా రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇలా తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వానంద్ ఏడడుగులు వేయడంతో ఎంతోమంది రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయని తెలుస్తోంది. ఈమె తాతయ్య బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిగా పనిచేశారని తెలుస్తోంది. అలాగే రక్షిత తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

ఈ విధంగా రక్షితకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాకుండా ఈమెకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తుంది. వీరి తాతల ఆస్తి వేలకోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి రక్షిత రెడ్డి పేరు మీదనే వందల కోట్ల ఆస్తి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా రక్షిత రెడ్డి భార్య ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి అని అర్థమవుతుంది.

Sharwanand -Rakshitha Reddy: వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్న రక్షిత…

శర్వానంద్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈయన కాస్త ఆలస్యంగా పెళ్లి చేసుకున్నప్పటికీ భారీ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంటికి శర్వానంద్ అల్లుడుగా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రక్షిత రెడ్డికి సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది.

Ramana Gogula: నష్టాలలో కూరుకపోయిన పవన్ మ్యూజిక్ డైరెక్టర్… ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

Ramana Gogula: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల జీవితాలు అంటే తామరాకుపై నీటి చుక్క లాంటిది. వారి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీలు గా మారిపోతే మరికొందరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న వారిలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఒకరు.

ఈయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడి బాగా డబ్బు సంపాదించారు. అనంతరం ఇండియాకి వచ్చి ఇక్కడ ఒక మ్యూజిక్ సంస్థతో పనిచేసి అనంతరం వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇలా మొదటి సినిమాని సూపర్ హిట్ కావడంతో ఈయనకు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇక పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు బద్రి అన్నవరం జానీ వంటి సినిమాలకు కూడా ఈయన సంగీత దర్శకుడిగా పనిచేశారు.

Ramana Gogula: తిరిగా అమెరికా వెళ్ళిపోయిన రమణ గోగుల…

ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమణ గోగుల సుమంత్ హీరోగా బోణీ అనే చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా డిజాస్టర్ కావడంతో భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. అదే విధంగా డైరెక్టర్ తేజతో కలిసి 1000 అబద్దాలు అనే సినిమాని కూడా నిర్మించారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఈయన చాలా నష్టాలలోకి కూరుకుపోయారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈయన తిరిగి అమెరికా వెళ్లి స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించి భారీగా డబ్బు సంపాదించారు.

నేను మోనార్క్ ని .. నన్ను ఎవరు మోసం చేయలేరు అంటూనే..రూ.8 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి.. చివరికి?

ప్రస్తుత కాలంలో రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఎక్కువైపోయాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు డబ్బులు దోచుకుంటున్నారు.అయితే సాధారణ వ్యక్తులు లేదా చదువుకోని వారు ఇలాంటి వారి చేతిలో మోసపోయారు అంటే అర్థం ఉంటుంది కానీ.. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే వ్యక్తికి మాత్రం సైబర్ నేరగాళ్లకు గురించి చాలా అవగాహన ఉంటుంది.ఈ విధంగానే ఇంజనీర్ గా పని చేసేటటువంటి ఓ వ్యక్తి తనను ఎవరూ మోసం చేయలేరు అంటూ ఏకంగా 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది.

అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతని కార్డు వివరాలను అడిగారు. ఈ క్రమంలోనే ఆ ఇంజనీర్ ఈ విషయం గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశారు.ఈ విధంగా వచ్చే ఫోన్ కాల్స్ తో ఎంతో అప్రమత్తంగా ఉండే ఇంజనీర్ చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తుగా మోసపోయాడు. తనకు తక్కువ జీతం రావడంతో అతను డబ్బు సంపాదించాలన్న ఆశ పెరిగింది. ఈ క్రమంలోనే కొంత డబ్బులు వ్యాపారంలోకి పెట్టి మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి కేవలం 20 వేల పెట్టుబడితో కొన్ని రోజుల తర్వాత మీరు రూ. 62000 లాభం పొందుతారని చెప్పడంతో ఇంజనీర్ కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు అతనికి ఒక లింకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ విధంగా వివరాలన్నీ ఉండటంతో ఇంజనీర్ ఇరవై వేలు పెట్టుబడి పెట్టి కొద్దిరోజులకు 62000 లాభం పొందాడు. ఈ విధంగా డబ్బులు రావడంతో అతనికి ఆశ పెరిగింది.

ఈ క్రమంలోనే మరింత డబ్బు సంపాదించాలని భావించిన ఇంజనీర్ ఈ సారి ఏకంగా అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టాడు. ఒకేసారి ఎనిమిది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు.ఈసారి ఎక్కువ డబ్బులను పొందవచ్చని భావించింన ఇంజనీర్ కి అప్లికేషన్ ఫామ్లో విత్ డ్రా బటన్ కనిపించకపోవడంతో అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ రావడంతో అతను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.