Tag Archives: sridevi

NTR: ఎన్టీఆర్ ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా… అవకాశం వస్తే ఆ సినిమాని రీమేక్ చేస్తా: ఎన్టీఆర్

NTR:గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ మీకు మల్టీ స్టార్ సినిమాలో చేసే అవకాశం వస్తే ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా ఈయన మాత్రం మహేష్ బాబుతో చేస్తాను అంటూ సమాధానం చెప్పారు ఇక తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఏదైనా సినిమాను రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమా చేస్తారని ప్రశ్నించగా తాను దానవీరశూరకర్ణ సినిమా చేస్తానని ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

నాకు ఇష్టమైనటువంటి హీరోలలో ఎన్టీఆర్ గారు ఒకరిని అలాగే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం అంటూ తారక్ కామెంట్ చేశారు. ఇక రాజమౌళి వివి వినాయక్ కృష్ణవంశీ ఈ ముగ్గురు దర్శకులలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది. ఇక ఈ ప్రశ్న వేయడంతో ఇదొక చండాలమైన ప్రశ్న అంటూ తారక్ సమాధానం చెప్పడం సంచలనంగా మారింది.

NTR: ముగ్గురు చాలా ప్రత్యేకం…


ఈ ముగ్గురు చాలా టాలెంటెడ్ డైరెక్టర్లని ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ అని అడగడం పిచ్చి ప్రశ్న అంటూ సమాధానం చెప్పారు. నా దృష్టిలో ఈ ముగ్గురు డైరెక్టర్లు ఒకటేనని ఈ ముగ్గురు తన కెరీర్ లోఎంతో ముఖ్యమైన వారని తనకు ఎంతో మంచి సక్సెస్ సినిమాలను అందించారు అంటూ ఈ సందర్భంగా తారక్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rajinikanth: మీనా అందం చూసి ఆశ్చర్యపోయాను… ఎంతో ప్రతిభావంతురాలు… రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

Rajinikanth: కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ నటి మీనా గురించి పెద్ద ఎత్తున ప్రశంసల కురిపించారు. మీనా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ సినిమాలలో మీనా తనకు కూతురిగాను అలాగే తనకు మేనకోడలిగాను చివరికి హీరోయిన్ గాను నటించి మెప్పించారు. రజనీకాంత్ నటించిన యజమాన్ సినిమాలో హీరోయిన్గా మీనా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా ఆమె నటించిన రెండు తెలుగు పాటలు ప్లే చేసి తనకు చూపించారని రజనీకాంత్ తెలిపారు. అయితే అక్కడ మీనాను చూసి తను చాలా ఆశ్చర్యపోయానని రజిని తెలిపారు.

నేను చేసిన సినిమాలో కూతురి పాత్రలో నటించిన ఆపిల్లేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయానని మీనా చాలా అందంగా ఉండే వారిని రజనీకాంత్ తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో కేవలం ఇద్దరి హీరోయిన్లు అంటే ఇష్టమని ఒకరు శ్రీదేవి కాక మరొకరు మీనా అని తెలిపారు. అయితే మీనా చాలా ప్రతిభావంతురాలని నిజాయితీపరురాలని, ఆమె ప్రతిభనే తననీ ఈ స్థాయిలో నిలబెట్టిందని రజనీకాంత్ తెలిపారు.

Rajinikanth: ఎంతో నిజాయితీపరురాలు…


ఇలా రజనీకాంత్ నటి మీనా గురించి ఈ స్థాయిలో పొగడటంతో మీనా క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది.ఇక హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగిన మీనా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 సంవత్సరాలు కావడంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ మీనానికి ఎంతో ఘనంగా సత్కరించిన విషయం మనకు తెలిసిందే.

Chiranjeevi: చిరంజీవి మనసు దోచుకున్న హీరోయిన్ తనే.. ఏకంగా మంచి కెమిస్ట్రీ ఉందంటూ?

Chiranjeevi: గత మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఆ తరం హీరోయిన్ల నుంచి ఈ తరం హీరోయిన్ల వరకు అందరితో నటించాడు చిరంజీవి. ఈయనతో పాటు ఈయన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

నటుడుగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు చిరంజీవి. ఎంతోమందికి సహాయం చేసి మంచి మనసున్న వ్యక్తిగా నిలిచాడు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక లలో ఎవరు బెస్ట్ అని ప్రశ్న ఎదురవటంతో వెంటనే చిరంజీవి ఈ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని తప్పించుకున్నాడు.

కానీ ఈ హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని.. అంతేకానీ వాళ్లలో ఎవరు బెస్ట్ అని అడిగితే చెప్పలేను అని అన్నాడు. ఇక ఒక్కో హీరోయిన్లలో ఒక్కో స్పెషాలిటీ ఉందని అన్నాడు. రాధిక సహజంగా, సులువుగా నటిస్తుంది అని.. రాధ అద్భుతంగా డాన్స్ చేస్తుంది అని.. విజయశాంతి పర్ఫెక్ట్ అని తెలిపాడు. ఇక తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అని మనసులో మాట బయటపెట్టాడు.

Chiranjeevi:

ఇక శ్రీదేవి గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆమె తనకు వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా రిలేషన్ ఉందని.. తనతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని అన్నాడు. అంతేకాకుండా తమది ఉత్తమ జంటగా కూడా ప్రేక్షకులు భావిస్తూ ఉంటారని.. తామిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బాగా హిట్ అయ్యాయని.. నటన విషయంలో, విషయంలో శ్రీదేవి చాలా బెస్ట్ అని తెలిపాడు.

Krishna: కృష్ణ మనసు పడ్డ టాప్ హీరోయిన్ ఆమెనా.. అసలు విషయం చెప్పిన సీనియర్ జర్నలిస్ట్?

Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సాహస ప్రయోగాత్మక చిత్రాలను పరిచయం చేసిన నటుడిగా పేరుపొందారు.ఇలా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి కృష్ణ గారు మంగళవారం తుది శ్వాస విడిచారు. సుమారు ఐదు దశాబ్దాల సినీ కెరియర్ లో సుమారు 350 కి పైగా సినిమాలలో నటించారు.

ఇలా ఇన్ని సినిమాలలో నటించిన కృష్ణ సుమారు 80 మంది హీరోయిన్లతో నటించి సందడి చేశారు. ఇకపోతే ఈ హీరోయిన్లలో కృష్ణ మనసు పడ్డ హీరోయిన్ మాత్రం శ్రీదేవి అంటూ సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు తెలియజేశారు. సాధారణంగా కృష్ణ గారు ఇతర హీరోయిన్లతో నటిస్తే ఆయన ఎంతో రిజర్వ్డ్ గా ఉండేవారు.

హీరోయిన్లు చనువుగా అతనితో నటించిన ఆయన మాత్రం దూరం దూరంగా ఉండేవారని శ్రీదేవితో మాత్రం ఆయన ఎంతో ఆసక్తిగా నటించేవారని ఈయన తెలిపారు. ఈ విధంగా ఎంతో మంది హీరోయిన్లతో కృష్ణ నటించినప్పటికీ ఆయన మనసు పడ్డ టాప్ హీరోయిన్ మాత్రం శ్రీదేవినని ఆ తర్వాత జయప్రదతో కూడా అంతే ఇష్టంగా నటించేవారు అంటూ ఈయన వెల్లడించారు.

hna

Krishna: శ్రీదేవితో ఆసక్తిగా నటించేవారు…

కృష్ణ సుమారు 350 సినిమాలలో నటించిన ఈయన 50 సినిమాలను కేవలం విజయనిర్మలతో కలిసి నటించారు. 40 పైగా జయప్రదతో కలిసి నటించారు. అలాగే 32 సినిమాలను శ్రీదేవితో కలిసి నటించారు. ఇకపోతే కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే నటి జయప్రద సైతం ఆయన మంచితనం గురించి తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్టు ఇమంది రామారావు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీ ఏంటో తెలుసా..?

Super Star Krishna : అలనాటి నటుల్లో విపరీతంగా ఫామ్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడి మరీ సినిమాలను తీసేవారు. అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సూపర్ స్టార్. అయితే అతడు నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటి “చుట్టాలున్నారు జాగ్రత్త”. ఈ సినిమా విడుదలై దాదాపు 40 ఏళ్లు కావొస్తోంది.

ఈ సందర్భంగా దాని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. ఈ సినిమాను అలపర్తి సుర్యనారాయణ నిర్మించారు. మన్నవ బాలయ్య స్టొరీ, స్క్రీన్ ప్లే అందిచారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఈ సినిమా 167వది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ సరసన హీరోయిన్లుగా శ్రీదేవి, గీతలు నటించారు.

డబుల్ రోల్ లో కృష్ణ నటించారు. ఈ సినిమాకు బి.వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కాన్సెప్ట్ తోనే పలు సినిమాలను దర్శక నిర్మాతలు రూపొందించారు. తమిళంలో రజనీకాంత్ హీరోగా రిమేక్ కూడా చేశారు. హిందీలో మవాలీ పేరుతో రీమేక్ చేశారు.

ఇక్కడ జితేంద్ర హీరోగా నటించారు. దీనికి సంగీతాన్ని విశ్వనాథ్ అందించారు. దీనిలో రావు గోపాలరావు, నూతన ప్రసాద్, సూర్యాకాంతం కీ రోల్స్ లో నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణతో పాటు హీరోయిన్లకు, మన్నవ బాలయ్యకు చక్కటి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాతనే కృష్ణ పలు సనిమాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

Chiranjeevi -Vishal: చిరంజీవి ఫ్యామిలీకి విశాల్ ఫ్యామిలీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Chiranjeevi -Vishal: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది.ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా మెగాస్టార్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి గారికి యంగ్ హీరో విశాల్ కి మధ్య ఓ రిలేషన్ ఉంది. అయితే ఆ రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

విశాల్ తండ్రి జీకే రెడ్డి పలు తమిళ, తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసారు.ఇలా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న ఈయన అనంతరం నిర్మాతగా మారి తన కొడుకు విశాల్ ను సందెకోళి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. లింగస్వామి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది అయితే ఇది విశాల్ కి రెండవ సినిమా. ఈ సినిమాని తెలుగులో పందెంకోడి పేరుతో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా విజయం సాధించడంతో విశాల్ హీరోగా వచ్చే సినిమాలన్నీ కూడా ఆయన తండ్రి నిర్మాణంలోనే వచ్చాయి.ఇకపోతే ఈయన విశాల్ హీరో కాకముందు పలు తెలుగు తమిళ సినిమాలను కూడా నిర్మించారు ఈ క్రమంలోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఎస్పీ పరశురామ్ అనే సినిమాకి కూడా విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

Chiranjeevi -Vishal: డిజాస్టర్ గా పరుశురాం..

తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎస్పీ పరశురాం సినిమాని విశాల్ తండ్రి జీకే రెడ్డితో పాటు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా విశాల్ తండ్రితో మెగాస్టార్ చిరంజీవికి ఓ నిర్మాతగా మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి.

Chiranjeevi – Sridevi : కొడుకు వాడుకుని వదిలేసాడని అతని తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకునే విచిత్రమైన కథతో వచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..?

పౌరాణిక చిత్రాల పరంపర అప్రతిహతంగా కొనసాగి, ఇక మెల్లిగా సాంఘిక చిత్రాల వైపు తెలుగు పరిశ్రమ మళ్ళింది. 1970 దశకంలో కథానాయకునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాటలు, ఫైట్లతో కథానాయకుడిని అమాంతం ఆకాశానికి ఎత్తేయడంలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది.

ఇక 1980 దశకం ప్రారంభంలో శంకరాభరణం, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, ఊరికి మొనగాడు, న్యాయం కావాలి, ఇల్లాలు, బెబ్బులి పులి, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల పరంపరలో అప్పుడే సినీపరిశ్రమలోకి కొత్తగా వచ్చిన చిరంజీవి ప్రతి కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. 1981లో టీ.ఎల్ వీ.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘రాణికాసుల రంగమ్మ’ చిత్రం లో చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించారు. సమాజంలో పలుకుబడి ఉన్న జగ్గయ్య ఆగర్భ శ్రీమంతుడు, అతనికి ఒకే ఒక్క కొడుకు చిరంజీవి. తల్లి చిన్నప్పుడే చనిపోవడం వలన అతని గారాబంగా జగ్గయ్య పెంచి పెద్ద చేస్తాడు. కానీ చిరంజీవి జల్సాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు.

రోజంతా క్లబ్బుల్లో గడుపుతూ రాత్రి అయ్యాక ఇంటికి రావడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక పల్లెటూరుకి చిరంజీవి వెళ్ళినప్పుడు రాణికాసుల రంగమ్మ (శ్రీదేవి) పరిచయమవుతుంది. అమాయకురాలైన రాణికాసుల రంగమ్మ తో పరిచయం పెంచుకుంటాడు. అదును చూసి చిరంజీవి రాణికాసుల రంగమ్మ మోసం చేసి అనుభవిస్తాడు.

ఆ తర్వాత మోసపోయిన శ్రీదేవి, చిరంజీవి చిరునామా తెలుసుకొని ఏకంగా ఆయన ఇంటికి వెళుతుంది. అక్కడ ఆయన తండ్రి గారైన జగ్గయ్యను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తుంది. అప్పుడు జగ్గయ్య ఆయన ఆఫీసులో ఉద్యోగం కల్పిస్తాడు. కొడుకును పెళ్లి చేసుకోమని ఎంతగా వారించినా చిరంజీవి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటాడు. ఇలాంటి జల్సా రాయుడు కి ఎలాంటి గుణపాఠం చెప్పాలో తండ్రి జగ్గయ్య ఆ క్రమంలో జగ్గయ్య భార్య లేకపోవడం వలన రాణికాసుల రంగమ్మ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. తన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని చూసి చిరంజీవి సంతోష పడతాడు. చివరికి తన తండ్రి పెళ్లిచేసుకునేది ఒకప్పుడు తన చేతిలో మోసపోయిన రాణికాసుల రంగమ్మ అని గుర్తించి చిరంజీవి ఆ పెళ్లికి అడ్డుపడతాడు.

తండ్రి ఎందుకు అలా చేస్తున్నావని కొడుకును నిలదీయడంతో.. తాను రాణికాసుల రంగమ్మ ను ఏవిధంగా అన్యాయం చేశానన్న విషయాన్ని తండ్రికి తెలియజేస్తాడు. శ్రీదేవి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం, జగ్గయ్య కొడుకు గుణపాఠం రావాలనే రాణికాసుల రంగమ్మను పెళ్లి చేసుకుంటానని నాటకం ఆడానని మంచి మాటలు తెలియజేయడంతో చిరంజీవి మారి శ్రీదేవిని అనగా రాణికాసుల రంగమ్మను పెళ్లి చేసుకుంటాడు. ఇంతటితో సినిమాకి శుభం పడుతుంది.

పెద్ద అందగత్తె కాదని ఎగతాళి చేసారు.. ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా : నటి ఆమని

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జంబలకడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని ఆ తర్వాత శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ తల్లి పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఆమని మరొక హీరోయిన్ ఇంద్రజతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమని కెరియర్ మొదట్లో తను ఎదుర్కొన్న అవమానాలను గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో కాస్త వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా ఆమనీ మాట్లాడుతూ.. తనకు దొంగతనం చేసిన మామిడి పండ్లు తినడం ఎంతో ఇష్టమని ఈ విధంగా తన ఇష్టాఇష్టాలను తెలిపారు. అదే విధంగా తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే సినిమాలంటే ఎంతో పిచ్చని, అప్పుడే శ్రీదేవి, జయసుధ జయప్రద వంటి తారలను చూస్తూ పెరిగానని,ఆమని తెలిపారు.

ఇక పెద్దయిన తర్వాత తనకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో తన కుటుంబ సభ్యులు తనని చూసి హేళన చేశారని.. నలుగురితో సరిగ్గా మాట్లాడటం రాదు నువ్వు సినిమాలలో ఏం నటిస్తావు? పైగా పెద్ద అందగత్తెవి కూడా కాదని తన కుటుంబ సభ్యులు అనడంతో ఆ సమయంలో చాలా బాధ పడ్డానని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు. ప్రస్తుతం ఈమె సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడమే కాకుండా బుల్లితెరపై ముత్యమంతా ముద్దు అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

శ్రీదేవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్.. కాని 1990 తరువాత ఆమెకు కలిసిరాని తెలుగు చిత్రాలు.!!

అందానికి నిర్వచనం శ్రీదేవి.. అభినయానికి నిదర్శనం శ్రీదేవి.. బాలనటిగా మొదలైన ఆమె ప్రస్థానం.. అంచలంచలుగా అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న అతికొద్ది కథానాయికల్లో శ్రీదేవి ఒకరు. కాలం కలిసి రావడమో లేదా శ్రీదేవి అందం,అభినయమో.. మొత్తానికి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.

1980 దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలతో తీరికలేని సమయాన్ని గడిపారు. అలాంటి శ్రీదేవి 1990 దశకం వచ్చేసరికి హిందీ చిత్రాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు లో కొన్ని చిత్రాల్లో ఆమె నటించారు. అయితే అవి బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూద్దాం. 1991 దుర్గా ఆర్ట్స్, కె.ఎల్.నారాయణ నిర్మాణం, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం’ చిత్రం విడుదలైంది. తెలుగులో శివ చిత్రం తర్వాత రాంగోపాల్ వర్మకు క్షణక్షణం రెండవ చిత్రం. వర్మ కాలేజీ రోజుల్లో ఉండగానే శ్రీదేవి కి వీరాభిమాని.శ్రీదేవితో ఒక సినిమా చేయాలన్న కళ ఆయనకు ‘క్షణ క్షణం’సినిమాతో తీరిపోయింది. విడుదల తొలి విడతలో ఫ్లాప్ ను మూటగట్టుకున్న క్షణక్షణం చిత్రం. మలి విడతలో అబౌ యావరేజ్ గా నిలిచింది.

ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి పోయిన శ్రీదేవి తిరిగి మళ్ళీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించింది. 1994, వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గోవిందా గోవిందా’ చిత్రం విడుదలైంది. శ్రీదేవి, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అశ్వినీదత్ లాంటి బారి కాంబో లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చూసింది. దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవితో తీయాలన్న కళ నెరవేరి నప్పటికీ… ఆమెతో విజయవంతమైన చిత్రాలను రూపొందించలేకపోయాడు. ఈ సినిమా తర్వాత ఆరు నెలల గ్యాప్ లో శ్రీదేవి మరో తెలుగు చిత్రంలో నటించింది. 1994 అల్లు అరవింద్ నిర్మాణం,రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎస్పీ పరశురామ్ చిత్రం విడుదలైంది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చిన ఆ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు.

1994 లో శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ జరగగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని కోలాహలం మొదలైంది. 1994 జూన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎస్పి పరశురాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం తర్వాత శ్రీదేవి తెలుగు చిత్రాలకు దూరమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ.. 2004 దశకం వచ్చేసరికి ఆమె వయసు మీద పడడం, సినిమాలు తగ్గిపోవడం లాంటివి జరిగాయి. 2004 లో ‘మేరీ బీవీ క జవాబు నహీ’ 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్..చిత్రాలు శ్రీదేవికి మంచి పేరును తీసుకువచ్చాయి. దుబాయిలో పెళ్ళికి హాజరవడానికి వెళ్ళిన శ్రీదేవి ప్రమాదవశాత్తు ఆమె బస చేసిన హోటల్ బాత్ టబ్ లో పడి 2018 ఫిబ్రవరిలో మరణించారు.

సినిమాల్లోకి వస్తున్న శ్రీదేవి మేనకోడలు… ఎంత అందంగా ఉందో చూశారా?

అలనాటి అందాల తార, దివంగత నటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా అన్ని భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు ఆరంభించి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగింది. ఈమె తన అందం అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది.

శ్రీదేవి సినీ ఇండస్ట్రీలో తనదంటూ చేరగని ఒక ముద్రను వేసుకుంది. ఇది ఇలా ఉంటే అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. శ్రీదేవి మేనకోడలు శిరీష. ఓ ప్రైవేటు మ్యూజిక్‌ వీడియో సాంగ్‌లో ఆమె కనువిందు చేస్తోంది.

కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్‌ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్‌ వీడియో నెటిజన్ లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో లవ్ ట్రాక్ ను రెండు, మూడు, జనరేషన్ లో చూపించారు.

అయితే ఈ వీడియోలో ఆమెతో పాటుగా మరొక సీనియర్‌ నటుడు మనవడు కూడా నటించాడు. శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీషకు జోడిగా నటించాడు. కొన్ని జనరేషన్‌లుగా లవ్‌ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో ఈ పాట సాగింది.ఈ పాటలో శిరీష, దర్శన్‌లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్‌ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది.యదలో మౌనం అంటూ సాగే ఈ మ్యూజిక్‌ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చగా.. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్‌ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జాన్వి బాలీవుడ్‌ లో వరస సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. ఇక రెండో కూమార్తె ఖుషి కపూర్‌ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.