Chiranjeevi -Vishal: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది.ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా మెగాస్టార్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి గారికి యంగ్ హీరో విశాల్ కి మధ్య ఓ రిలేషన్ ఉంది. అయితే ఆ రిలేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
విశాల్ తండ్రి జీకే రెడ్డి పలు తమిళ, తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసారు.ఇలా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న ఈయన అనంతరం నిర్మాతగా మారి తన కొడుకు విశాల్ ను సందెకోళి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. లింగస్వామి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా మంచి హిట్ అయింది అయితే ఇది విశాల్ కి రెండవ సినిమా. ఈ సినిమాని తెలుగులో పందెంకోడి పేరుతో విడుదల చేశారు.
ఇక ఈ సినిమా విజయం సాధించడంతో విశాల్ హీరోగా వచ్చే సినిమాలన్నీ కూడా ఆయన తండ్రి నిర్మాణంలోనే వచ్చాయి.ఇకపోతే ఈయన విశాల్ హీరో కాకముందు పలు తెలుగు తమిళ సినిమాలను కూడా నిర్మించారు ఈ క్రమంలోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఎస్పీ పరశురామ్ అనే సినిమాకి కూడా విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎస్పీ పరశురాం సినిమాని విశాల్ తండ్రి జీకే రెడ్డితో పాటు అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా విశాల్ తండ్రితో మెగాస్టార్ చిరంజీవికి ఓ నిర్మాతగా మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…