Featured

Shoaib akhtar : ఇరు జట్లు మ్యాచ్ ఓడిపోడానికి బాగా కష్టపడ్డారు… ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ మీద ఘాటుగా స్పందించిన పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..!

Shoaib akhtar : మొన్న ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో ఇండియా, పాకిస్థాన్ మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య ఇండియా ను గెలిపించి మ్యాజిక్ చేసాడు. అయితే చాలా రోజుల తరువాత ఉత్కంటభరితంగా జరిగిన మ్యాచ్ అందరికీ నచ్చింది. టీం ఇండియా మీద అందరూ ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ ను కామన్ జనాలతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో టెన్షన్ గా చూసారు. చాలా ఏళ్ల తరువాత ఇలాంటి ఒక ఉద్వేగభరిత మ్యాచ్ చూశామంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ఇండియన్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్య ను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం పూర్తి భిన్నంగా కామెంట్స్ చేసాడు.

పాక్, ఇండియా ఇద్దరూ ఓడిపోడానికి చాలా కష్టపడ్డారు…

పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో వేదికగా ఇరు జట్ల ప్రదర్శన బాగోలేదని ఓడిపోడానికి చాలా కష్టపడ్డారు, అయితే హార్దిక్ పాండ్య మాత్రమే ఇండియా టీం ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి ఇండియాను గెలిపించాడు అంటూ కామెంట్ చేసాడు. నిజానికి మ్యాచ్ జరిగిన రోజును బ్యాడ్ డే గా వర్ణించాడు షోయబ్ అక్తర్. దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు నేను ఎవరినీ అవమానించడమే లేదు అంటూ అయన వివరణ ఇచ్చారు.

బాబర్‌ అజమ్‌ని ఓపెనింగ్‌కు తీసుకోవద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఫఖర్ జమాన్‌- రిజ్వాన్‌ కలిసి ఓపెనింగ్‌ కి వస్తే, బాబర్‌ వన్‌ డౌన్లో వచ్చి కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. భారత్‌ కూడా జడేజాను నాలుగో స్థానంలో పంపింది. రెండు జట్లు కూడా బ్యాడ్‌ క్రికెట్‌ను ఆడాయి. ఇరు జట్లు దారుణమైన క్రికెట్‌ ఆడాయి, అంటూ కామెంట్స్ చేసారు. ఇవే కాకుండా మహమ్మద్ రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేసాడు ఇది ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. డాట్ బాల్స్ ఎక్కువ ఆడటం ప్రమాదకరం. పాక్ ఆడినపుడు తొలి 6 ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. ఇక ఇండియా టీం లో రిషబ్ ను పక్కన పెట్టి తప్పు చేసింది, ఇక పాక్ ఏమో ఇఫ్తార్ అహమ్మద్ ను నాలుగో ప్లేసులో లో పంపి తప్పు చేసిందిఅంటూ చెప్పారు. మొత్తానికి మ్యాచ్ డే ను బ్యాడ్ డే గా వర్ణించాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago