Karthikeya 2: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.
ఇక ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాలీవుడ్ సినిమాలలో టాప్ టెన్ పొజిషన్లో పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా విజయం పై గుజరాత్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఇలా ఎంతో విజయవంతంగా ఈ సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్లోనే ప్రముఖ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
హైదరాబాద్ లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్ వేయబోతున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది.సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఒకటవ తేదీ స్పెషల్ షోలో భాగంగా జల్సా సినిమాని ఈ థియేటర్లో విడుదల చేయనున్నారు.
ఈ విధంగా జల్సా సినిమా ప్రదర్శన నిమిత్తం కార్తికేయ సినిమాకు బ్రేక్ పడింది.ఇక ఈ స్పెషల్ షో అనంతరం యధావిధిగా కార్తికేయ సినిమా ప్రదర్శన అవుతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి థియేటర్ యాజమాన్యంతో అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించారు కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కోసమే కార్తికేయ సినిమాకు కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…