Venu swami : సోషల్ మీడియాలో మీ జాతకం ఎలా ఉండబోతోంది, రాబోయే రోజుల్లో ఈ రాసి వారికి పట్టిందల్లా బంగారమే అంటూ జాతకాలకు సంబంధిచిన మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఎంతోమంది వీడియోలు పెడుతుంటారు. జాతకాలను గ్రహ స్థితులను బట్టి మన తలరాత ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పే మాటలను నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఇక ఇలాంటి జాతకాలు చెప్పే వారిలో ఈమధ్య కాలంలో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతున్న వ్యక్తి వేణు స్వామి. సెలబ్రిటీల భవిష్యత్తును చెబుతూ బాగా ఫేమస్ అయిన వేణు స్వామి తాజాగా బాలకృష్ణ గురించి మాట్లాడి వైరల్ అయ్యారు.
బాలయ్య అందరిలా ముసుగు వేసుకుని మాట్లాడరు…
వేణు స్వామి బాగా పాపులర్ అయింది సమంత, నాగచైతన్య విడాకుల ఇష్యూ తో. వాళ్ళు వీడిపోతారని ముందే చెప్పేసాడు వేణు స్వామి. ఇక రష్మిక మొదటి ఎంగేజ్మెంట్ విషయంలో కూడా చెప్పానంటూ వేణు స్వామి ఆ మధ్య చెప్పాడు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరో పెళ్లి మీద కామెంట్స్ చేసాడు. అయితే ఇపుడు బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు బాగా తెలుసనీ సమర సింహా రెడ్డి, నరసింహా నాయుడు సినిమాలకు తానే ముహూర్తం పెట్టానని చెప్పారు.
ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడితే చాలా గౌరవంగా చూస్తారని నేను నెక్స్ట్ జరగబోయే విషయాలు ఆయనతో చెబితే మళ్ళీ కొద్ది రోజులకు ఫోన్ చేసి జరిగాయా ఆ రోజు చెప్పినవి అంటూ ఆరా తీశారు. అందరిలా అయన ముసుగు వేసుకుని మాట్లాడరు. బయట బాలయ్య మీద వచ్చే వార్తల్లో నిజం లేదని ఆయన చాలా మంచి మనిషి అంటూ చెప్పాడు వేణు స్వామి. ఇటీవలే వేణు స్వామి విజయ్ దేవరకొండ కెరీర్ అంతగా బాగుండదు అంటూ చెప్పి సంచలనం రేపాడు. ఇక రాజకీయ నాయకుల భవిష్యత్తులను చెబుతూ వైరల్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…