Tag Archives: sridhar

Sridhar : ఎన్‌టిఆర్‌ తో ఆ సినిమా చేయడం వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయా!?

ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి నంటే ఎవరైనా నమ్మగలరా..అవును ఇది వాస్తవం. నందమూరి తారక రామారావు హీరోగా నటించిన
ఎన్నో సినిమాలతో ఎంతో మంది కొత్త నటీ నటులు సాంకేతిక నిపుణులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వారిలో చాలామంది సక్సెస్ సాధించారు కూడా. ఎన్‌టిఆర్‌ సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమాల ద్వారా కూడా చాలా మందికి ఆయన లైఫ్ ఇచ్చారు. అప్పటి తరం వారెవైరైనా ఇప్పుడు ఉంటే ఎన్‌టిఆర్‌ వల్ల వారు సహాయం పొందిన వారైతే ఖచ్చితంగా ఆ విషయాలను, సందర్భాలను చాలా గొప్పగా చెప్పుకుంటారు.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

అలాంటి ఎన్‌టిఆర్‌ మూలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలగాల్సిన ఓ నటుడు మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దురదృష్ఠవశాత్తు అది ఎన్‌టిఆర్‌ సినిమాల వల్లే కావడం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఆ నటుడెవరో కాదు ముత్యాల ముగ్గు సినిమాతో మంచి గురింపు ..పేరు తెచ్చుకున్న శ్రీధర్. ఆయన అసలు పేరు సూరపనేని శ్రీధర్. 1939 డిసెంబర్ 21న కృష్ణా జిల్లా, ఉయ్యూరు దగ్గర్లోని కుమ్మమూరు గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అప్పటి నటీ నటుల మాదిరిగా శ్రీధర్ కూడా నాటక రంగంలో పలు నాటకాలు వేసి రంగస్థలం మీద పాపులర్ అయ్యాడు. అలా పాపులారిటీ తెచ్చిన నాటకాలు పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు వంటివి. వీటిలో అతను పోషించిన ప్రధాన పాత్రలకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో తల్లా? పెళ్లామా? సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

నటనపరంగా శ్రీధర్‌కు ముందు నుంచే మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడుగా మూడు దశాబ్దాలపాటు మంచి పాత్రలు పోషించి దాదాపు 150 సినిమాలలో నటించాడు. శ్రీధర్‌కు తెలుగులో బాగా పేరు తెచ్చిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమాతో గుర్తింపు పొందిన శ్రీధర్ ఎక్కువగా అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన దాదాపు చాలా సినిమాలలోనూ మంచి పాత్రలు పోషించాడు. ఇండస్ట్రీలో ఇతనికి బాగా సపోర్ట్ చేసింది అంటే కృష్ణ గారే.

Sridhar : ఆ సినిమా నటించడం వల్లే శ్రీధర్ కు హీరో అవకాశాలు తగ్గాయా?

జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీరామారావు కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. శ్రీధర్ మంచి టాలెంటెడ్ హీరో. కానీ ఆయనకు హీరోగా సరైన అవకాశాలు దక్కలేదు. అయినా ఏనాడు వేషాలకోసం నిర్మాతల ఆఫీసుల చుటూ, దర్శకుల చుట్టూ తిరిగింది లేదట. అవకాశం వచ్చిన సినిమాలలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టి నటించాడు. ఇక మరో స్టార్ హీరో శోభన్ బాబు ఇన్స్పిరేషన్‌తో నటుడిగా ఉండగానే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి..బాగా సంపాదించారు. ఈ వ్యాపారం తనకు బాగా కలిసొచ్చింది.

Sridhar : ఎన్‌టిఆర్‌ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి.!

హీరోగా నటిస్తున్న సమయంలో శ్రీధర్‌ తోటి ఎన్‌టిఆర్‌ తన స్వంత చిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. ఇది తనకు బాగా కలిసొస్తుందనుకున్నాడు. కానీ ఇదే అవకాశాలు లేకుండా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అంతకు ముందు ఎన్‌టిఆర్‌ గుహుడు వేషానికి డ్రైవర్‌ రాముడులో సెకెండ్‌ హీరో వేషానికి ఏదో లింకుపెట్టి ఇచ్చారట. అయితే డ్రైవర్‌ రాముడు సూపర్ హిట్  సాధించింది. అయినా శ్రీధర్‌ కు హీరో అవకాశాలు దక్కలేదు. ఈ రకంగా శ్రీధర్‌కు సూపర్ హిట్‌ చిత్రాలలో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అతను నటించిన చిత్రాలలో అమెరికా అమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక శ్రీధర్ నటించిన ఆఖరి సినిమా నాగార్జున – శ్రీదేవి జంటగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన
గోవిందా గోవిందా. 

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో 651 ఉద్యోగాల భర్తీ.?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. 651 ఉద్యోగాల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ ఈ ఏడాది మార్చి నెలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని అన్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే నోటిఫికేషన్ కాకుండా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తామని వెల్లడించారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

రాతపరీక్ష, ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఈ ఉద్యోగాలతో పాటు సింగరేణి సంస్థలో 1,436 ఇతర ఉద్యోగాల భర్తీ కూడా జరగనుందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడనుంది. 651 ఉద్యోగాల భర్తీలో 569 కార్మికుల ఉద్యోగాలు, అధికారిక పోస్టులకు సంబంధించిన 82 ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఆఫీసర్లు, జూనియర్ ఫారెస్ట్ అధికారులు, మేనేజ్ మెంట్ ట్రెయినీ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగాలు కాకుండా మిగిలిన కార్మికుల ఉద్యోగాలలో మౌల్డర్స్, మిషన్ ట్రెయినీలు, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రైనీలు, ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలుస్తోంది. 1,436 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ లు, టెక్నీషియన్లకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సైతం వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సర్కార్ సైతం ఏకంగా 50,000 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.