Tag Archives: srinivasarao

భోజనం సమయంలోనూ కిరీటం తీయని బాలయ్య.. ఎందుకంటే?

సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అతడు సెట్ చేసిన ట్రెండ్ ను చాలమంది ఫాలో అయ్యేవారు. మొదట అతడు నందమూరి తారకరామారావు నటించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. మొదట అతడు ‘మాయాబ‌జార్‌’ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అతడి దర్శకత్వంలో తన టాలెంట్ ను నిరూపించుకున్న సినిమా పుష్పక విమానం. అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ తో ఎలాగైనా సినిమా చేయాలని అనుకున్నారట.

కానీ అది నెరవేరలేక పోయినా.. అతడి వారసుడితో సినిమా తీశాడు. అదే.. ‘ఆదిత్య 369’, ‘భైర‌వ ద్వీపం’ సినిమాలు తీసి.. క్లాసిక్స్ గా తనకు తిరుగులేదంటూ నిరూపించుకున్నారు. ఆ సినిమాలు తీస్తున్న క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ లో ఉన్న లక్షణాలు బాలయ్యలో ఉన్నాయంటూ చెబుతుండేవారు. పౌరాణిక చిత్రం తీస్తున్న క్రమంలో అతడు ధరించిన ఆభరణాలను షూటింగ్ అయిపోయేవరకు కూడా తీసేవారు కాదట ఎన్టీఆర్.

అలాంటి లక్షణం బాలయ్యకు కూడా వచ్చిందంటూ.. చెప్పుకొచ్చాడు సింగీతం శ్రీనివాసరావు. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్ర వేస్తున్న టైంలో బాలయ్య ఆ కిరీటం ఎంత ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే ఉంచేవారని చెప్పాడు. భోజనం చేస్తున్న సమయంలో కూడా కిరీటం తీసేవారు కాదని, అలా తీస్తూ మరి వాటిని ధరించడానికి ఆలస్యం అవుతుందన్న కారణంతో వాటిని అలాగే ఉంచుకునే వారని సింగీతం శ్రీనివాస్ తెలియజేశారు.

ఓ రోజు ఆదిత్య 369 సినిమా షూటింగ్ లో లైటింగ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. ఆ సమయంలో బాల‌కృష్ణ‌ను కాస్త ఆలస్యంగా రమ్మని డైరెక్టర్ చెప్పగా.. అతడు ఇంటి దగ్గరే ఉన్నాడు. అప్పడు ఎన్టీఆర్ ఏంటి.. ఈ రోజు షూటింగ్ లేదా అని అడగ్గా.. డైరెక్టర్ లేటుగా రమ్మాన్నరని చెప్పాడట. అయితే దానికి ఎన్టీఆర్ నిర్మాత మనకు డబ్బులు ఇస్తున్నది.. ఉదయం నుంచి సాయంత్రం వారకు వాళ్లకు అందుబాటులో ఉండటానకి కానీ ఇలా ఇంటి దగ్గర ఉండటానికి కాదంటూ అనడంతో అప్పటి నుంచి అతడు ఇలా షూటింగ్ లోనే ఎక్కువ సమయం గడిపేవారు అంటూ సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.