Tag Archives: ss rajahmouli

ఐస్ క్రీంపార్లర్ లో పనిచేసిన రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఎందకంటే..?

రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ.. జగపతి బాబు బంధువైన పూజను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దసరా పండుగ నేపథ్యంలో వాళ్లు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పూజ వృత్తి రీత్యా సింగర్. దాదాపు సంవత్సరం వరకు తాము స్నేహితులుగా ఉన్నామని.. తర్వాత తానే ప్రపోజ్ చేశానని కార్తికేయ అన్నారు.

ఆమె ఒప్పుకోవడంతో 2019 డిసెంబర్ 28 న జైపూర్ ప్యాలెస్ లో పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు. పూజ పాటలు అంటే చాలా ఇష్టమని.. తనకు కావాల్సినప్పుడల్లా సాంగ్ పాడుతూ ఉంటుందని కార్తికేయ చెప్పాడు. 10 డిగ్రీల చలిలో తమ పెళ్లి అయిందని చెప్పాడు. సొంతంగా తాను సంపాదించడం కోసం ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో పని చేశానని.. సొంత జీతం ద్వారా వచ్చిన డబ్బులను ఖర్చు చేస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందన్నారు.

పెళ్లి అంటే ట్రస్ట్, లవ్, సెక్యూరిటీ, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటూ చెప్పాడు. తన నాన్న రాజమౌళి గురించి మాట్లాడుతూ రోడ్డుపై ట్రాఫిక్ లేకపోయినా.. స్లోగా డ్రైవ్ చేస్తాడని చెప్పాడు. ఇక పూజ మాట్లాడుతూ.. తాను సినిమా వాళ్లను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నట్లు చెప్పారు. కానీ కార్తికేయ అడగ్గానే ఆలోచించి ఒప్పుకున్నట్లు చెప్పారు.

సంద్రదాయ సంగీతం నేర్చుకున్నా.. కానీ ప్రస్తుతం ప్రాక్టీస్ లేదని చెప్పింది. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారని.. పది సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉంటారని ఆమె అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ లో కూడా తన భాగస్వామ్యం ఉందని.. నైట్ షూట్స్ టైంలో తాను అందరికీ ఐస్ క్రీం తెప్పించేదాన్ని అంటూ నవ్వుకుంటూ చెప్పారు.

అనంత శ్రీరామ్ ఏ సినిమాలోని పాట రాయడానికి దాదాపు70 రోజుల సమయాన్ని తీసుకున్నాడు.?

కోటి కాంతులతో విరాజిల్లేది ఆ కోదండరాముడు అయితే లక్షల విలువచేసే అక్షరాలను లిఖించేది ఈ అనంత శ్రీరాముడు. సందర్భోచితంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి వారి మాటలనే తన పాటలుగా చేసి సందర్భాన్ని, సంగతిని ప్రేక్షకుడి కళ్ళకు కట్టినట్టుగా వినసొంపుగా తన పాటలహరిలో పరవశింప చేస్తాడు.

 

ప్రేమ పాటలను అనంత శ్రీరామ్ అలవోకగా ప్రేక్షకుడి మనసుకు తాకేలా తన కలాన్ని కదుపుతాడు. ప్రేమికుల్లో ప్రేమికుడు అవుతాడు.వారి సరససల్లాపాలను సరిగమలతో చుట్టేస్తాడు. వారి విరహాన్ని విసుక్కుంటాడు. వారి విహారానికి పక్షి లాంటి రెక్కలు తొడుగుతాడు. ప్రేమికుల యెదలో చేరి అన్నీచేస్తూ ఉంటాడు. ఆ వయసులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం అని పలుకుతాడు. ప్రేమికుల మనసులో ఊహా ప్రపంచాన్ని నిర్మిస్తాడు. వారిని ఆనందడోలికల్లో ఊగిస్తాడు.

ఇలాంటి అందమైన అనుభూతి గల పాటలను రాసే అనంత శ్రీరామ్ కి ఒక సందర్భంలో బాహుబలి లోని ఒక పాట రాయడానికి ఆ సినిమా దర్శకుడు రాజమౌళి శ్రీరామ్ ని సంప్రదించాడు. అప్పుడు బాహుబలి లో తమన్నా మాహిష్మతి సామ్రాజ్య తిరుగుబాటు యోధురాలు అదేవిధంగా కథానాయకుడు ప్రభాస్ ఓ గిరిజన తెగలో పెరుగుతున్న యోధుడు. వీరి మధ్య ఏ భాష సరళిని వాడాలి గ్రామ్యమా గ్రాంథికమమా.? అన్నది ఒక అంశం.

ప్రభాస్ తమన్నా లు అన్యోన్యంగా ఉండేటప్పుడు ప్రభాస్ తమన్నాకు వేసిన పచ్చబొట్టు వారి కౌగిలింతలో కలిసేచోటా బావగర్భిత పాట రాయాలని రాజమౌళి చెప్పగా.. అనంత శ్రీరామ్ కి మరింత సమయం కావాల్సి వచ్చింది. అలా పచ్చబొట్టేసిన.. పిల్లగాడా అనే పాట రాయడానికి అనంత శ్రీరామ్ దాదాపు 70 రోజుల సమయం తీసుకోవడం జరిగింది. బాహుబలి సినిమాలో అలాంటి పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.